ప్రకాశం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 13 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన ఛాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లావాదేవీలు సక్రమంగా జరగడం లేదని తన దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం తరపున రైతులకు మద్దతు ధర కల్పించాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ఒక్క గింజ కూడా బయటకు వెళ్ళకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన పద్దతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సక్రమంగా పాటించేలా చూడాలని, విరుద్ధంగా చేపడితే వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫోర్టు, హమాలీ చార్జీలకు సంబంధించి నిజ నిర్థారణ నివేదిక వచ్చేంత వరకు చార్జీల చెల్లింపులు నిలిపి వేయాలని ఆయన అధికారులను సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రాధమిక వ్యవసాయసహకార సంఘాలు ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలను అనుసరించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అక్రమాలకు అవకాశం కల్పించకుండా రైతులకు మేలు కలిగేలా వ్యవహరించాలన్నారు. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై ఎపిడి రాజేంద్రను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించేలా చూడాలని సంయుక్త కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి టి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు , సహాయ పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.