ప్రకాశం

ఆడ పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 14 : మహిళలు, ఆడ పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి హెచ్చరించారు. సంతమాగులూరు మండలంలో మైనర్ బాలిక (9)పై 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అత్యాచార ప్రయత్నం చేయబోగా ఆ అమ్మాయి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ బాలికను ఆదివారం ఒంగోలు రిమ్స్‌లో చేర్చగా విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి రిమ్స్‌లో పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే చివరి రోజు అవుతుందని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. రోజురోజుకు మహిళలు, ఆడ పిల్లలపై దాడులు పెరుగుతున్నాయని, వాటికి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై దాడులు జరిగితే కఠినంగా శిక్షించాలని పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. సంతమాగులూరు మండలంలో జరిగిన ఈ సంఘటనపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని రమాదేవి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సఖీ టీం సభ్యులు ఉన్నారు.