ప్రకాశం

రానున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు బుద్ధిచెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 14 : రానున్న 2019 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు బుద్ధిచెప్పాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలు నగరంలోని రెండో డివిజన్ గుడివెళ్లపాడు, ముక్తినూతలపాడు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, మేనిఫెస్టోతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీని రానున్న 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పార్లమెంట్‌లో చేసిన విభజన హామీల అమలు, రూ.5 లక్షల కోట్ల ప్యాకేజీ, 14 జాతీయ విద్యా సంస్థలు వస్తాయన్నారు. వాటితోపాటు రామాయపట్నం పోర్టు, పోలవరం నిర్మాణం పూర్తి, విశాఖపట్నంలో రైల్వేజోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు, రైతులు, మహిళలు పార్టీలకు అతీతంగా రాహుల్‌గాంధీకి ఓటు వేస్తామని, ఈ సారి హస్తం గుర్తుకు తప్పకుండా ఓటు వేస్తామని ఆనందంగా చెప్తున్నారని వెల్లడించారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం, వైకాపా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షలు, ప్రతి ఇంటికి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు టి బుజ్జి, గుడివెల్లపాడు నాయకులు జాకోబ్, రెండో డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు, నాయకులు కె సుబ్బారావు, కొత్తపట్నం మండల అధ్యక్షులు ఎన్ కోటిరెడ్డి, నాయకులు ఎస్ రవి, నాయుడు వెంకటేశ్వర్లు, ఎస్‌కె రసూల్, జాలయ్య తదితరులు పాల్గొన్నారు.