ప్రకాశం

నేటి ముఖ్యమంత్రి పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 14 : ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మారుస్తున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తేల్చిచెప్పారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సోమవారం ఒంగోలులో జరగాల్సి ఉందని, అనివార్య కారణాల వలన ఆ పర్యటన రద్దయ్యిందని తెలిపారు. సోమవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి సమావేశం అనంతరం రాత్రికి ఒంగోలులో బసచేయాల్సి ఉండగా సోమవారం రాత్రి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశం జరగాల్సి ఉందన్నారు. అయితే కేవలం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతోనే సమీక్ష సమావేశం జరుగుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో రానున్న 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకునే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తుంటే కొంతమంది కేవలం నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు పదేపదే ప్రచారం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్యనాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అంతేతప్ప ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సమర్ధవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అలాంటి నాయకుడిని 2019 ఎన్నికల్లో తిరిగి గెలవాలని తామంతా ముందుకు వెళ్తుంటే అపోహలు సృష్టిస్తూ నాయకుల మధ్య మనస్పర్ధలు వచ్చేవిధంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటీవల జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో తామంతా ప్రశాంతంగా మాట్లాడుకున్నామని చెప్పారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలను పెద్దఎత్తున అమలుచేస్తూ ప్రజలు సంతోషంగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలకు రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దయినప్పటికీ ప్రతిభావంతుల అవార్డుల సభ యధావిధిగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ముఖ్యనాయకులతోపాటు రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పాల్గొంటారన్నారు. ఈ నెలాఖరులో ఒంగోలులో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, ఈ సమయంలో ప్రజలకు మరెన్నో పనులు చేయాల్సి ఉందన్నారు. ఇలాంటి తరుణంలో తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ప్రయత్నాలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క ఇన్‌ఛార్జిని తొలగించేది, తీసివేసేది లేదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక
ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు మంజూరు
* మాజీమంత్రి మహీధర్‌రెడ్డి స్పష్టం * 17వ వార్డులో నవరత్నాలపై అవగాహన
కందుకూరు, అక్టోబర్ 14: రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 17వ వార్డు పెద్దబజారు, ఇస్కాలవారి వీధి, రాళ్ళవాగు తదితర ప్రాంతాలలో రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని పెద్దలు, పిల్లలు మహీధర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహీధర్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు పథకం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాల్లాంటి 9 సంక్షేమ పథకాలను అమలుచేస్తారని చెప్పారు. అమ్మఒడి పథకం ద్వారా ఎల్‌కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, ఇద్దరు పిల్లలను బడికి పంపితే ఏడాదికి తల్లికి రూ.30వేలు అందజేస్తామని తెలిపారు. జగన్ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టించనున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు. అలాగే మహిళలకు వడ్డీలేని రుణాలు, పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి భరోసా కల్పిస్తూ నవరత్నాలు పథకాన్ని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రూపొందించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు, రామాలయంలో మహీధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుర్రం సింగయ్య, శివ, వి మాలకొండయ్య, రామకృష్ణ, కె బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, కోటా వెంకటేశ్వర్లు, ఆసిఫ్, మీరావలి, బి వెంకటేశ్వర్లు, టి కార్తీక్, వెంకటరావు, మురారిశెట్టి వెంకటేశ్వర్లు, ఇమ్మడిశెట్టి శ్రీను, అవ్వారు బాలకోటయ్య, వైసిపి పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, నాయకులు ఖాదర్‌బాషా, జె కోటేశ్వరరావు, జవహర్‌బాషా, కె నరసింగరావు, దారం మాల్యాద్రి, ధామస్, గేరా మనోహర్, ఎం కృష్ణ, గంగిరెడ్డి, టి రవణయ్య, మహిళా నాయకురాలు కామాక్షినాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.