ఖమ్మం

ఒక్క అవకాశమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి, అక్టోబర్ 14: సత్తుపల్లి నియోజకవర్గంలో తనను గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పిడమర్తి రవి కోరారు. ఆదివారం వీఎం బంజర్‌రోని స్థానిక పంక్షన్‌హాల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిడమర్తి మాట్లాడుతూ తనకు సత్తుపల్లిలో సమస్యలు అవగాహన అవుతున్నాయని ఇక్కడి సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజానికానికి అండగా ఉంటానని తెలిపారు. ఎంపీ పొంగులేటి, మంత్రి తుమ్మల, జలగం వర్గీయులు అందరూ కలిసి టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకోసం పనిచేస్తే సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడి పోయినప్పటికిని ఈ ప్రాంతాన్ని వదలకుండా అనేక సమస్యలను పరిష్కరించటంతో పాటు కోట్ల రుపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. తాను ఒక్కసారి మాటిస్తే తప్పకుండా పట్టు వదలకుండా అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా మాట్లాడుతూ సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి గెలుపు సునాయాసమని వర్గాలకతీతంగా పార్టీ కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలలో విడివిడిగా పనిచేసిన ఈ నియోజకవర్గ నాయకులందరూ ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీలోనే అందరూ కలిసి పనిచేయటం పిడమర్తి రవి గెలుపుకు కలిసి వచ్చే ప్రధాన అంశమని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గ్రామగ్రామాలలో తిరుగుతూ ప్రజలకు వివరించటంతో పాటు కారు గుర్తును ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా విభేదాలను పక్కనబెట్టి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో తుమ్మల, పొంగులేటి వర్గీయులు కలిసి పాల్గొని తామంతా పార్టీ నిర్ణయం మేరకే పనిచేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ రావు, ఆత్మా చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, బుడ్డయ్య, చెక్కిలాల మోహన్‌రావు, చీకటి రామారావు, చింతనిప్పు శ్రీను, శ్రీనివాసరెడ్డి, వంగా గిరిజాపతిరావు తదితరులు పాల్గొన్నారు.