ప్రకాశం

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, నవంబర్ 12 : అద్దంకి బ్రాంచి కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు రోడ్డెక్కారు. ఆయకట్టు పరిధిలోని కొమ్మాలపాడు, మామిళ్ళపల్లి, మక్కెనవారిపాలెం, సజ్జాపురం, కుందుర్రు, బల్లికురవ మండలంలోని రైతులు వందలాది మంది రాస్తారోకో చేశారు. అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మక్కెనవారిపాలెం సమీపంలోని అద్దంకి బ్రాంచి కెనాల్ వద్ద మధ్యాహ్నం 12 నుండి మూడు గంటల వరకు రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాజకీయ నాయకులెవ్వరి పిలుపు లేకుండానే వందలాదిగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత పది రోజులుగా సాగునీరు నిలుపుదల చేయడంతో తమ భూములు నిలువునా ఎండిపోతున్నాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నీరు విడుదల చేసేంత వరకు ఆందోళన విరమించేద లేదని భీష్మించుకూర్చున్నారు. సంతమాగూలూరు ఇన్‌చార్జి ఎస్ ఐ పాండురంగారావు తన సిబ్బందితో వెళ్ళి రైతులను ఆందోళన విరమించాలని కోరగా ఒక దశలో వాదోపవాదనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రైతుల ఆగ్రహానికి పోలీసులు సంయమనం పాటించడంతో ఏలాంటి దుష్ఫరిణామాలు చోటు చేసుకోలేదు. రైతుల ఆందోళన వద్దకు వచ్చిన నాగార్జున సాగర్ ఒంగోలు సర్కిల్ ఎస్‌ఐ రవి మాట్లాడుతూ 13వ తేది సాయంత్రానికి అద్దంకి బ్రాంచి కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో మూడు గంటల ప్రాంతంలో రైతులు రాస్తారోకో విరమింప చేశారు. రైతులు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వందలాది వాహనాలు కిలో మీటర్ల మేర ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యారు.
దీక్ష విరమించని ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వెంకయ్య
అద్దంకి బ్రాంచి కెనాల్‌కు సాగునీరు పూర్తిస్థాయిలో విడుదల చేసేంత వరకు తాను దీక్ష కొనసాగిస్తానన్న ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ దావులూరి వెంకయ్య తన దీక్షను సోమవారం కూడా కొనసాగించారు. అద్దంకి బ్రాంచి కెనాల్‌కు నీటి విడుదల విషయంలో అధికారులు వివక్షత చూపుతున్నారంటూ ఆదివారం మధ్యాహ్నం వెంకయ్య దీక్షకు పూనుకున్నారు. దీక్ష విరమించాల్సిందిగా ఆదివారం రాత్రి అధికారులు ఒక దఫా చర్చలు జరిపినప్పటికీ ససేమిరా అన్నారు. అధికారులు సోమవారం మరోసారి వెంకయ్య దీక్ష బూనిన మామిళ్ళపల్లి వద్ద అద్దంకి బ్రాంచి కెనాల్ కట్టపై ఉన్న దీక్షా శిబిరానికి చేరుకుని మంగళవారం సాయంత్రానికి అద్దంకి బ్రాంచి కెనాల్‌కు 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అదే పరిమాణం పదిరోజుల పాటు కొనసాగే విధంగా తాము హామీ ఇస్తున్నామని ఒంగోలు ఎస్‌ఈ రవి వెంకయ్యకు నచ్చచెప్పబోయారు. రైతుల తరపున దీక్ష బూనినందుకు వెంకయ్యను దుశ్శాలువాతో సన్మానిస్తున్న ఎస్‌ఈ రవి శాలువాతో సన్మానించినప్పటికీ దీక్ష విరమించడానికి వెంకయ్య ఒప్పుకోలేదు. నీరు కాలువలో చూసిన తరువాతనే తాను దీక్ష విరమిస్తానని, అప్పటి వరకు ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, పొగడ్తలు పొడిగినా తాను రైతుల పక్షాన న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని వెంకయ్య స్పష్టం చేశారు.