ప్రకాశం

చీమకుర్తి జంటహత్యలకు కారకులెవ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి,నవంబర్ 13: చీమకుర్తిలో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో సెప్టెంబర్ 19న మద్దివారివీధిలో దిండికుర్తి సుబ్బారావు, ఆయన భార్య ఆదిలక్ష్మి రాత్రి పదిగంటలకు తమ కిరాణాషాపునకు తాళాలు వేసిన తరువాత ఇంటికి వెళ్లిన తరువాత ఇద్దరిని హంతకులు గొంతులు కోసి పరారయ్యారు. ఎంతకి బయటకు రాకపోవటంతో ఇంటి యజమాని పైకి వెళ్లి చూడగా ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చీమకుర్తి, ఒంగోలు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి కుక్కలను వెంట పెట్టుకుని వెతకగా ఇసుకవాగు సెంటరు వాగువద్దకు వెళ్లి వెనుదిరిగాయి. దిండికుర్తి సుబ్బారావు, ఆదిలక్ష్మి హత్యకేసుకు సంబంధించి అధికారిగా సీఐ రాఘవేంద్రను నియమించారు. హత్య జరిగి రెండునెలలు కావస్తున్న ఇంతవరకు హత్య ఏవిధంగా జరిగింది, ఎవరు చేశారు అనేది పోలీసులు ఇంతవరకు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో హత్యచేసింది పెద్దలని ప్రచారం జరుగుతున్నా పోలీసులు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. హత్య ఎందుకు చేశారు. వేరే కారణాలా, లేక పొలం తగాదాల వలన వారిని హత్యచేశారా అనేది ఇంతవరకు తెలలేదు. దిండికుర్తి సుబ్బారావు గత 20సంవత్సరాలనుండి చీమకుర్తిలోని ఇసుకవాగు సెంటర్‌లో కిరాణాషాపు నడుపుతూ తరువాత గ్రానైట్ రంగంలో అడుగుపెట్టి గ్రానైట్‌లో నష్టాలు వచ్చిన తరువాత అప్పులుపాలు కావటంతో కొంతపొలాన్ని అమ్మి బాకీదారులకు చెల్లించి కొంత నగదును వడ్డీవ్యాపారులకు ఇచ్చి ఉన్నాడు. సుబ్బారావును అప్పు ఇచ్చిన వారు హత్యచేశారా, లేక ఆస్తి ఘర్షణలు అన్న విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సెప్టెంబర్ 19న చేసిన పోలీసుల హడావుడి ఇప్పటివరకు పోలీసులు చీమకుర్తి ప్రాంతంలో విచారణకాని, దర్యాప్తుకాని చేపట్టకపోవటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమతున్నాయి. సుబ్బారావు హత్యవెనుక పెద్దల హస్తం ఉందా లేక ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అని ప్రజలు అనుమానిస్తున్నారు. హత్య జరిగి రెండునెలలు కావస్తున్న ఇంతవరకు హంతకులను అరెస్టుచేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్య జరిగిన రోజు ఆర్యవైశ్యసంఘాలు ధర్నా, రాస్తారాకోలు చేశారు. కానీ హత్య చేసిన వారిని అరెస్టుచేయాలని ఆ సంఘాలు నోరుమెదకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఈహత్యల్లో పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికైనా హత్యచేసిన వారిని పోలీసులు పట్టుకుని శిక్షించాలని మండలప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.