ప్రకాశం

జాతీయ స్థాయి పోటీలకు దర్శి గురుకుల విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, నవంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ బాలయోగి గురుకుల కళాశాల విద్యార్థి జాతీయ స్థాయి అట్యా-పాట్యా పోటీలకు ఎంపికైనట్లు కాలేజీ ప్రిన్సిపాల్ జెయల్‌యన్ మూర్తి పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొని ప్రకాశం జిల్లాకు ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. నవంబర్ 16, 17, 18 తేదీల్లో జరిగే వరిస్సాలోని కటక్‌లో జూనియర్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆ విద్యార్థిని కళాశాల పీడీ ఎ వీరరాఘవయ్య, పీఈటీ వెన్నపూస వీరభద్రారెడ్డి అభినందించారు.

‘రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలుకుదాం’
గిద్దలూరు, నవంబర్ 15: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, ఈ పాలనకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని వైకాపా జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్, చిన్నమసీదు ప్రాంతాల్లో రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల కరపత్రాలు ప్రజలకు అందచేశారు. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చెన్నకేశవరెడ్డి, నాని, సునిల్, రవీంద్ర, స్రవన్‌కుమార్, పుల్లారెడ్డి, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
‘గ్రామదర్శిని ద్వారా ప్రజాసమస్యల పరిష్కారం’
గిద్దలూరు, నవంబర్ 15: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు, వాటి పరిష్కారం కనుగొనేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు. గ్రామదర్శినితోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు వెలుగుచూసి పరిష్కారానికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తహశీల్దార్ వల్లీకుమార్, ఎంపీడీవో మస్తాన్‌వలి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, వెటర్నరీ డాక్టర్ సాయిచక్రవర్తి, ఎంపీటీసీ చేరెడ్డి ఉమాదేవి పాల్గొన్నారు.

‘పరిసరాల పరిశుభ్రతో అంటువ్యాధులు దూరం’
మద్దిపాడు, నవంబర్ 15 : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అంటువ్యాధులు దరిచేరవని వెల్లంపల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి ఆర్ శ్రీనివాసులునాయుడు తెలిపారు. గురువారం మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు బోర్డు ఆవరణ, వెల్లంపల్లి ప్రధాన వీధులను తన సిబ్బంది, వెల్లంపల్లి అక్షయ యూపి పాఠశాల విద్యార్థులు కలిసి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైడు కాలువల్లో నీరు లేకుండా చూడాలని, తద్వారా దోమలు పెరగవని ఆయన తెలిపారు. భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. దోమల వలన ప్రాణాంతకమైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలుతాయని ఆయన తెలిపారు. పొగాకు బోర్డు సిబ్బంది దేశ వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి పొగాకు బోర్డు సిబ్బంది, అక్షయ యూపి పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.