ప్రకాశం

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి : దామచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపట్నం, నవంబర్ 15 : ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ అన్నారు. ప్రతిజ్ఞ బూనుదాం - ప్రగతిని సాధిద్దాం కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి 14 మండలాల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే జనార్థన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను, ప్రతి గ్రామాభివృద్ధికి కావాల్సిన అవసరాలను తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. మండలంలోని అధికారులను సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలోని గ్రామాల ప్రజల పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ తక్షణమే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. మండలంలోని 14 పంచాయతీల్లోని ప్రజలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కారం మార్గం చూపాలని ఎమ్మెల్యే సూచించారు. సంకువానిగుంట గ్రామస్థులకు తొమ్మిది మందికి ఇంటి నివేశ స్థలాల పట్టాలు అందజేశారు. ఆదరణ -2 అభ్యర్థులకు వాషింగ్ మిషన్లు, నలుగురికి ఇస్ర్తి పెట్టెలు అందించారు. మండలంలోని అసైన్డ్ భూములకు ఆన్‌లైన్ చేయడంలో జాప్యం జరుగుతుందని, అధికారులు వేగవంతం చేసి పది రోజుల్లో పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సిహెచ్ పెంచలయ్య, ఎంపిడివో అజిత, తహశీల్దార్ బివి రమణారావు, టిడిపి నాయకులు గేనం సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షులు బలగాని వెంకటేశ్వరరావు, మండలంలోని అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.