ప్రకాశం

కార్తీకమాసానికి సిద్ధమైన చెన్నకేశవుని పుష్కరిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 15: చారిత్రాత్మక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి పుష్కరిణి కార్తీకమాస దీపాలకు వేదికగా మారి నీటితో సిద్ధమైంది. సుమారు నాలుగేళ్ల తరువాత పుష్కరిణికి చెరువునీటిని విడుదల చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొని మార్కాపురం చెరువుకు నీరుచేరక ఎండిపోయిన పుష్కరిణి ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు చెరువుకు నీరు రావడంతో ఆ నీటిని పుష్కరిణికి మళ్లించారు. టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారుల నేతృత్వంలో పుష్కరిణిని నీటితో నింపేందుకు సన్నాహాలు చేశారు. ఇటీవల మార్కాపురం వచ్చిన దేవాదాయ ధర్మాదాయశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ భ్రమరాంబ శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామిని దర్శించుకున్న సందర్భంలో పుష్కరిణి గురించి కొందరు భక్తులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయశాఖ నుంచి రూ.90 వేలు నిధులు విడుదల చేస్తూ దాతల సహకారంతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి బి రమేష్, ఆలయ చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, పాలకవర్గంతో చర్చించి పనులు ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ చైర్‌పర్సన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, మున్సిపల్ ప్రతిపక్షనేత డాక్టర్ కనకదుర్గాలు పుష్కరిణి అభివృద్ధిలో కీలకపాత్ర వహించారు. ఎట్టకేలకు నవంబర్ 20న క్షీరాధ్భిద్వాదశి సందర్భంగా స్వామివారిని ఈ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్ల తరువాత పుష్కరిణిని అభివృద్ధి చేసి చెరువు ద్వారా నీటిని తరలించి తెప్పోత్సవానికి సిద్ధం చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.