ప్రకాశం

అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న అద్దంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, నవంబర్ 15 : అద్దంకి నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ కితాబిచ్చారు. గురువారం అద్దంకి పట్టణంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటిన్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రవికుమార్ కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా ప్రజా సమస్యలపై తమ కార్యాలయానికి వచ్చేది ఒక్క అద్దంకి ఎమ్మెల్యే రవికుమారే అన్నారు. చిన్న సమస్యకు సైతం స్వయంగా తానే వచ్చి పరిష్కారానికి కృషి చేయడాన్ని అభినందించారు. ప్రతి ఒక్కరు కడుపునిండా తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ కోరారు. రూ.5కే భోజనం అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కల్పించడం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ప్రభుత్వం ప్రతిఒక్కరి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ పధకం ప్రవేశపెట్టిందన్నారు. అన్న క్యాంటీన్లు ప్రతిచోటా విజయవంతంగా జరుగుతున్నాయని, అద్దంకిలో కూడా క్యాంటిన్ నిర్వహణకై దాతలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దయామణి, ఎంపీపీ కరి అరుణ, మున్సిపల్ కమిషనర్ నారాయణ, వార్డు సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకులు కావాలి
* డీఈవో విఎస్ సుబ్బారావు
మార్కాపురం టౌన్, నవంబర్ 15: ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకులు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ మాథ్యమిక శిక్షణ అభియాన్ రెండవదశ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు నిబద్ధత, ప్రణాళిక, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, విద్యార్థుల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచించారు. దశ నిర్దేశం చేసే స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నారని, ఉత్తమమైన బోధనతో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలతోపాటు పాఠశాలకు వారధిగా నిలిచి బహుముఖ ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శింపచేయాలని అన్నారు. అన్ని రంగాల్లో మార్గదర్శక స్థాయి పనితీరు కనబరుస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. అవగాహన కలిగిన రీసోర్సుబృందం సేవలను అందిపుచ్చుకొని శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో మేథస్సు పెంపొందించేలా అనుకూల దృక్పదంతో మంచి వాతావరణంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో సిహెచ్‌పి వెంకటరెడ్డి, మండల విద్యాధికారి రాందాసునాయక్, హెచ్‌ఎం మునగాల చంద్రశేఖర్‌రెడ్డి, బాలికోన్నత హెచ్‌ఎం శార్వాణి, వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.