ప్రకాశం

ఒంగోలులో ఒక మోస్తరు వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 16: గజ తుఫాన్ ప్రభావంతో ఒంగోలు నగరంలో శుక్రవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతోపాటు చల్లటి ఈదురు గాలులు వీస్తుండటంతో ఒంగోలు నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గజ తుఫాన్ ప్రభావంతో పక్కన ఉన్న నెల్లూరు జిల్లా తదితర ప్రాంతాలలో వర్షాలు ఎక్కువుగా కురవడంతో ఎక్కడ పెద్ద గాలులు వీచి వర్షం ఎక్కువుగా కురుస్తుందోన్న భయాందళనలో నగర ప్రజలు ఉన్నారు. అయితే గజ తుఫాన్ తీరం దాటిందని వాతావారణ శాఖాధికారులు ప్రకటించడంతో ఒంగోలు నగర ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. శుక్రవారం ఒంగోలు నగరంలో ఒక అరగంటపాలు ఒక మోస్తరు వర్షం కురిసింది. వర్షం కురవడంతో వివిధ పనులు మీద, ఒంగోలు నగరానికి వచ్చిన ప్రజలతోపాటు ఉద్యోగులు తమ విధులకు వెళ్ళే సమయంలో కొంత ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి వరకు నగరంలో చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. ఈ వర్షం మరింతగా కురిస్తే మాత్రం ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం శీతాకాలం అయినప్పటికీ నిన్న మొన్నటి వరకు ఒంగోలు నగరంలో ఎండవేడిమి ఎక్కువుగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఎవరిని కదిలించినా ప్రస్తుతం కాస్తున్న ఎండలు రెండో వేసవికాలాన్ని తలపించే విధంగా ఉన్నాయని మాట్లాడుకోవడం స్పష్టంగా కనిపించింది. దీంతో నగర ప్రజలు ఒంగోలులో ఎప్పుడు వర్షాలు కురుస్తాయా అని ఎదురుచూస్తున్న తరుణంలో గజ తుఫాన్ ప్రభావంతో శుక్రవారం ఒంగోలు నగరంలో ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడటంతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.