ప్రకాశం

సంతమాగులూరులో వైకాపా నేతల భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, నవంబర్ 16 : సంతమాగులూరు మండలంలో వైకాపా నేతలకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మండలంలోని పుట్టావారిపాలెం, కొమ్మాలపాడు, మామిళ్ళపల్లి, కుందుర్రు గ్రామాల్లో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్య, బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జి నందిగం సురేష్, యువ నాయకులు కల్లి ప్రసాద్‌రెడ్డి, గరటయ్య తనయుడు బాచిన కృష్ణ చైతన్య పర్యటించారు. కుందుర్రు, మామిళ్ళపల్లి, కొమ్మాలపాడు గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ సందేశాన్ని ప్రజలకు వివరించారు. కొమ్మాలపాడు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తెలుగుదేశం పార్టీ పాలనను పారద్రోలాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాదరణతో దూసుకుపోతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేకనే హత్యాయత్నానికి పాల్పడ్డారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు నైజమన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఇవాళ అదే పార్టీని తన భుజస్తంధాలపై మోసేస్థాయికి చంద్రబాబు దిగజారరన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాటు ఆ పార్టీకి వంత పాడి ఎపిలో ప్రజలకు ప్రత్యేకహోదా కోరుకుంటున్నారని బీజేపీతో ఇప్పుడు తెగతెంపులు చేసుకున్నట్లు నటిస్తున్నారన్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో పది సంవత్సరాల పాటు రాజధానిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు హైదరాబాద్ వదిలి అమరావతికి పరుగు తీశారన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించి వైకాపాను అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాలినేని స్పష్టం చేశారు. నవరత్నాలాంటి పథకాలతో ప్రతి ఒక్కరికీ మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు బాచిన చెంచు గరటయ్య, బాచిన కృష్ణ చైతన్య, నందిగం సురేష్, వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి వైకాపా అభ్యర్థి గరటయ్యే : బాలినేని
2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుండి వైకాపా అభ్యర్థిగా బాచిన చెంచుగరటయ్య పోటీ చేస్తారని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కుందుర్రులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమవేశంలో బాలినేని మాట్లాడుతూ గత కొంతకాలంగా అద్దంకి నియోజకవర్గం అభ్యర్థిత్వంపై పలు వదంతులు వినిపిస్తున్నాయన్నారు. అయితే వాటన్నింటిని నమ్మవద్దని గత ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన బాచిన చెంచుగరటయ్య అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఆయన తెలిపారు. ఈ వైకాపా నేతల పర్యటన సందర్భంగా సుమారు పదివేల మందికి భోజన ఏర్పాట్ల ను కొమ్మాలపాడు పార్టీ క్యాడర్ ఏర్పాటు చేసింది.