ప్రకాశం

అన్నా పయనమెటో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, నవంబర్ 16: గత ఏడాది ఆగస్టులో తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎటు పయనిస్తారో సందిగ్ధంలో ఉంది. ఆయన ఏపార్టీలో చేరుతారో అని ఆయన అనుచరులు వేచి చూస్తున్నారు. గతఏడాది ఆగస్టు 4న టీడీపికి రాజీమానా చేసినా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై స్నేహాభావాలను, వర్గాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రయాణం ఎటునుంచోనని నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఉన్నారు. గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో తనదైనశైలిలో రాణించి పదవిలో ఉన్నా లేకున్నా నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీ తరుపున బరిలో నిలిచి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గ్రామగ్రామాన పర్యటించి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. రెండవసారి ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రజలకు విస్తృత సేవలు అందించారు. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు చేస్తున్న అన్యాయన్ని విభేదించిన ఆయన టిడిపికి 2017 ఆగస్టు 4వతేదిన రాజీనామా చేశారు. అనంతరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి నియోజకవర్గ ప్రజలకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని, టిడిపి ఆకృత్యాలను ప్రజల్లోనికి తీసుకువస్తానన్న అన్నా రాంబాబు కొందరు పెద్దల సలహామేరకు పాదయాత్రను విరమించారు. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు ప్రతి కార్యక్రమానికి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. తాను 2019 ఎన్నికల బరిలో ఉంటానని, స్వతంత్య్ర అభ్యర్థిగానైనా పోటీచేసి విజయం సాధించడమే తన లక్ష్యమని అన్నా తన అనుచరులతో అంటున్నారు. .