ప్రకాశం

రుణమాఫీ లక్ష్యంగా రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, నవంబర్ 16: ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు కురిచేడుశాఖలో జరిగిన అవకతవకలు రోజుకొకటి చొప్పున వెలుగులోనికి వస్తున్నాయి. ఇప్పటికే ఈబ్యాంకులో జరిగిన నిధుల దుర్వినియోగంపై పూర్వమేనేజర్ మహాదేవగౌతమ్‌పద్మరాజుతోపాటు మరో ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపిన విషయం పాఠశాలకు విదితమే. రుణాల మంజూరులో లబ్ధిదారులకు, బ్యాంకు మేనేజర్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించిన దళారుల పాత్రపై తదుపరి దర్యాప్తు ఉంటుందని దర్శి డివైఎస్పీ నాగేశ్వరరావు ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇదిలాఉంటే ఇదే బ్యాంకులో లేనిపొలాన్ని వెబ్‌ల్యాండ్‌లో నమోదుచేసి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి లక్షలాది రూపాయల రుణాలు పొందిన సంఘటన వెలుగుచూసింది. తాజాగా ఈసంఘటనపై పోలీసులు దృష్టి సారించారు. నిన్నమొన్నటి వరకు బ్యాంకులో జరిగిన అవకతవకలకు మేనేజర్‌తోపాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు, దళారులు ప్రముఖపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాగా తాజాగా వెలుగుచూస్తున్న నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల ఘటనలో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం రుణమాఫీ హామీలను దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యక్తులు భారీమొత్తంలో వ్యవసాయ రుణాలు పొందినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు, బ్యాంకు మేనేజర్ సహకరించడంతో రుణాలు పొందడం సులభంగా మారింది. అవినీతికి అర్రులుచాచే రెవెన్యూ సిబ్బంది సహకారంతోనే నకిలీ పాసుపుస్తకాలు సృష్టించబడ్డాయి. సాగుభూములపై రుణం పొందాలంటే పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్, మీసేవ నుంచి పొందిన 1బి కాపీ, అడంగల్ కాపీలు కావాలి. కాగా నకిలీ పాసుపుస్తకాలు పొందిన వ్యక్తులు వెబ్‌ల్యాండ్‌లో తమ పేరిట పొలం ఉన్నట్లు రెవెన్యూ అధికారుల సహకారంతో సృష్టిస్తున్నారు. తహశీల్దార్ అనుమతి లేకుండా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడం సాధ్యంకానిపని. తహశీల్దార్‌ను ప్రసన్నం చేసుకొని బ్యాంకు రుణం పొందేంతవరకు వెబ్‌ల్యాండ్‌లో తమ పేరిట భూమి ఉందని ఆధారాలు చూపుతున్నారు. రుణం తీసుకున్న అనంతరం వెబ్‌ల్యాండ్ నుంచి వారి పేర్లను తొలగింప చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న పూర్వపుమేనేజర్ పద్మరాజు పని చేస్తున్న సమయంలో దళారుల మాటలు విశ్వసించి వెబ్‌ల్యాండ్‌లో నమోదుకాని పొలాలకు సైతం రుణాలు మంజూరు చేశారు. ఈనాటి వరకు సదరు భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు సరికదా గత మూడేళ్ళ నుంచి ఆయా రుణాలు తిరిగి చెల్లించనూ లేదు. తిరిగి చెల్లించడంలో బ్యాంకు రికవరీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకరిద్దరు వ్యక్తులు తమ అనుయాయుల పేరిట భారీ నకిలీ పుస్తకాలను తయారు చేయించి రుణాలు పొంది ఉన్నారు.