ప్రకాశం

చేనేత హస్తకళలకు చేయూతనందిస్తే ఉజ్వల భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, నవంబర్ 17 : వ్యవసాయ రంగం తరువాత అతిపెద్దరంగమైన చేనేత హస్తకళలను ప్రభుత్వాలు ప్రొత్సహిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పలువురు చేనేత హస్తకళల నిపుణులు అభిప్రాయపడ్డారు. మండలంలోని దేవాంగపురి పంచాయితీలోని సివి అండ్‌బిఎన్ హైస్కూలులో గత వారంరోజులుగా జరుగుతున్న జాతీయ చేనేత హస్తకళల నవీకరణ సంబరాలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈసంబరాలకు వివిధ దేశాలనుండి 150మందికి పైగా చేనేత హస్తకళల నిపుణులు, 17విశ్వవిద్యాలయాల ఆచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో డిల్లీకి చెందిన నిపుణుడు అశోక్ చటర్జీ, నెదార్లండ్ ప్రొఫెసర్ రెబ్‌బైకర్, చీఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ రవికుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ సంబరాల ద్వారా చేనేత హస్తకళలకు శాస్ర్తియత ఉందని పాలకపక్షాలపై ఒత్తిడి తీసుకువస్తే మరింత భవిష్యత్తు ఉంటుందన్నారు. చేనేత హస్తకళ ధార్మికులు మేధావులని, హితోధకులని గుర్తించారు. ఈ సంబరాల ద్వారా పలుప్రాంతాల్లో చేనేత హస్తకళలపై పరిశోధన చేసేందుకు విశ్వవిద్యాలయం ప్రతినిధులు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈసందర్బంగా మద్యప్రదేశ్‌కు చెందిన తానురాంధమంత్ బృందం ఆలపించిన కబీర్ గీతాలు అందర్ని ఆకట్టుకున్నాయి. ఆఖరిరోజు గుజరాత్, డిల్లీకి చెందిన ఖాదీ వస్త్రాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈసందర్బంగా జరిగిన కార్యక్రమాలను జాతీయ హస్తకళల కన్వీనర్ మాచర్ల మోహన్‌రావు, సమాఖ్య అధ్యక్షుడు దేవన వీరనాగేశ్వరరావు, కర్నా హనుమంతరావు, జయరామిరెడ్డి, బీరక పరమేశ్వర్ పర్యవేక్షించారు.