ప్రకాశం

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 17: నిత్యం ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావాలో, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే ప్రతిపక్ష నేత జగన్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ కూనా రవికుమార్ అన్నారు. శనివారం మార్కాపురం టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి జన్మదిన, మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేద బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమని, నేడు స్థానిక సంస్థల్లో హరిజన, గిరిజన బడుగువర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నందమూరి తారక రామారావుదని అన్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అక్రమంగా కోట్లు సంపాదించి 16 నెలలపాటు జైల్లో ఉండి బెయిల్‌పై వచ్చిన జగన్ ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అసలు పాదయాత్ర వలన ప్రజలకు కలిగే లాభం ఏమిటో జగన్ వెల్లడించాలని కోరారు. ఇటీవల కోడికత్తి పథకం రచించి ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నించారని, అది బెడిసికొట్టడంతో అధికార పార్టీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నేడు మార్కాపురం ఎఎంసి కమిటీ చైర్మన్ పదవి బీసీ వర్గానికి చెందిన యాదవ్‌కు లభించడం అభినందనీయమని, ఇందుకు కందులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పదవి లేకున్నా ప్రజలకు న్యాయం చేయాలనే ధ్యేయంతో పార్టీ ద్వారా వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిబాటలో నడిపించానని అన్నారు. అయితే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కార్యకర్తలు స్పందించడం లేదని అన్నారు. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి, తాగునీటి సమస్య పరిష్కారం కోసం 280 కోట్లు, జిల్లావైద్యశాలకు రూ.130 కోట్లు, ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి రూ.250 కోట్లు నిధులు తీసుకొచ్చామని, ఇంకా పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు తెచ్చి 30 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు అభివృద్ధి చేశామని అన్నారు.