ప్రకాశం

వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 17 : పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని అటవీ పర్యావరణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శనివారం మార్కాపురం మార్కెట్‌యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 2న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపడతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వలె వెలుగొండపై కూడా ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు శక్తి మేరకు కృషి చేస్తున్నారని, పేద, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అమలు చేయాల్సిన హామీలు అమలు చేయకుండా కేంద్రప్రభుత్వం ఏపీని అధోగతి పాల్జేసిందని, అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ నాడు చంద్రబాబునాయుడు వెలుగొండకు శంకుస్థాపన చేయడం, అటవీశాఖ అనుమతులు తీసుకురావడం వల్లనే అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పనులు ప్రారంభించేందుకు వీలైందని అన్నారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచి వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామనిఅన్నారు.యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మార్కాపురం డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల్లో టీడీపీని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, అయితే ఆ పార్టీ అధికారంలోకి రాకపోగా అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు లేవని, అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమమే బాధ్యతగా రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబునాయుడుకు ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరిగిందని, అలా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఓటమికి కూడా ఈ మూడు నియోజకవర్గాలే కారణమని, ప్రస్తుత ఎన్నికల్లో మాగుంట విజయానికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం అధోగతిపాలు కావడం ఖాయమని, తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడిపిస్తారని అన్నారు. మార్కాపురం, యర్రగొండపాలెం ఎన్నికల పరిశీలకునిగా అధిష్ఠానం తనను నియమించిందని, అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఈ నాలుగు నెలలకాలం కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో ఓటమి చెందిన కందుల నారాయణరెడ్డి ఎమ్మెల్యేలాగా అభివృద్ధికి పాటుపడుతుంటే గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా ప్రభుత్వంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, పొదిలి, మార్కాపురం ఎఎంసీ చైర్మన్లు రామలింగయ్య, కాకర్ల శ్రీనివాసులు, శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ కమిటీ చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, పలువురు డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.