ప్రకాశం

19న మస్టర్ కేంద్రాల్లో నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 18 : ఒంగోలు పారుశుద్ధ్య కార్మికులచే ఆర్‌టిఎఎస్, మైక్రోప్యాకెట్ విధానాన్ని బలవంతంగా అమలు చేయడాన్ని నిరసిస్తూ, కార్మికుల 22 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న మస్టర్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో కె గోపి అధ్యక్షతన యూనియన్ నగర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను యూనియన్ కార్యదర్శి యు రత్నకుమారి, వర్కింగ్ సెక్రటరీ శ్రీరామ్ శ్రీనివాసరావు ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ ఒంగోలు నగర గౌరవ అధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు, ముగ్గురు కార్మికులు 150-200 ఇళ్ల మధ్యలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తుంటే మైక్రోప్యాకెట్ విధానంలో 300-350 ఇళ్లు చేయాలనడం పనిభారం మోపడమే అవుతుందన్నారు. ప్రతి ఇంటిని పరిగణనలోకి తీసుకోవడం అంతసులభం కాదన్నారు. అపార్ట్‌మెంట్‌లను ఒక ఇల్లుగా పరిగణించడం సరికాదన్నారు. పారుశుద్ధ్య నిర్వహణ కంటే లక్ష్యాల ప్రకారం చెత్తసేకరణ చేయమనడం అన్యాయమన్నారు. 100 ఇళ్లకు ఒక కార్మికుడు చేయాలన్న నిబంధన పాటించమనడం, వాణిజ్య, ఇతర ఇళ్లు కూడా సాధారణ ఇళ్లుగానే లెక్కించడం సరికాదన్నారు. 279 జీవోను నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులుంటే జీవోలో భారమైన మైక్రోప్యాకెట్ విధానం అమలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి మహేష్, టి శ్రీనివాసరావు, ఎన్ వెంకటేశ్వర్లు, సిహె అక్వేశ్వరరావు, కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

‘వక్ఫ్‌బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు సహకరించాలి’
ఒంగోలు, నవంబర్ 18: ప్రకాశం జిల్లాలో గల వక్ఫ్‌బోర్డు ఆస్తిని బయటకు తీసి వాటి నుంచి వచ్చే ఆదాయం, స్థలాలు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకొని వక్ఫ్‌బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు డైరెక్టర్లు అందరూ సహకరించాలని ప్రకాశం జిల్లా వక్ఫ్‌బోర్డు కమిటీ చైర్మన్ షేక్ మహమ్మద్‌బాష కోరారు. ఆదివారం స్థానిక వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో షేక్ మహమ్మద్‌బాష అధ్యక్షతన కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డైరెక్టర్లు షేక్ వౌలాలి, సయ్యద్ అబ్దుల్‌కలామ్ అజాద్, షేక్ ఖాజా, షేక్ సలాం, షేక్ జిలానిబాష, పఠాన్, కరిముల్లా, హుస్సేన్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
* ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
బేస్తవారపేట, నవంబర్ 18: గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎం అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పందిళ్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు రూ.300 కోట్లతో ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లను సిమెంటురోడ్లుగా మార్చిన ఘనత టీడీపీదే అన్నారు. నంద్యాల - ఒంగోలు రోడ్డు నుంచి పందిళ్లపల్లి ఎస్సీకాలనీలో కోటి రూపాయలతో తారురోడ్డు నిర్మాణానికి, పందిళ్లపల్లి గ్రామంలోకి రూ.2.24 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, పందిళ్లపల్లి గ్రామానికి తారురోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షలతో శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తారురోడ్ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కె మోహన్‌రెడ్డి, టి భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సిహెచ్ వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.