ప్రకాశం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 18 : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సరాసరిన 4.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పొదిలి మండలంలో 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. కొత్తపట్నంలో 32, హనుమంతునిపాడులో 28.4, కందుకూరులో 22.2, మర్రిపూడిలో 20.4, వలేటివారిపాలెంలో 12.6 , తర్లుపాడులో 10.4, ఉలవపాడులో 9.8, కొనకనమిట్లలో 9.4, రాచర్లలో 8.8, సింగరాయకొండలో 8.2, ముండ్లమూరులో 7, గిద్దలూరులో 6.6, బేస్తవారిపేటలో 6.4, అద్దంకిలో 6.2. పొన్నలూరులో 6.2, పెదారవీడులో 4.6, కనిగిరిలో 4.4, కంభంలో 4.2, కురిచేడులో 4, పిసి పల్లిలో 3.8, ఒంగోలులో 3.6, టంగుటూరులో 3.4, పామూరులో 3, సంతనూతలపాడులో 2.4, వెలిగండ్లలో 2.4, దోర్నాలలో 2.4, మార్కాపురంలో 1.2, దొనకొండలో 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
50 కుటుంబాలు టీడీపీలో చేరిక
కనిగిరి, నవంబర్ 18 : కనిగిరి మండల పరిధిలోని యడవల్లి పంచాయతీ యర్రవోబునపల్లి గ్రామంలో ఆదివారం గ్రామదర్శిని- గ్రామవికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే బాబురావు చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కదిరి బాబూరావు మాట్లాడుతూ రూ.400 కోట్లతో ప్రతి గామానికి మంచినీరు సరఫరా పథకం మంజూరైందని, ప్రతి గ్రామానికి అన్ని రకాల వౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ప్రతి గ్రామంలో ఎవరూ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించానన్నారు. మీరందరూ మరోసారి నన్ను గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామచల్ల శ్రీనివాసులరెడ్డి, బేరి పుల్లారెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, యడవల్లి మాజీ సర్పంచ్ నారపురెడ్డి శ్రీనిసులరెడ్డి, వరికూటి బాలిరెడ్డి, కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో కొత్త వెంకటేశ్వర్లు, గొర్రె వెంకటసుబ్బారావు, అన్నం రంగయ్య, అన్నం చిన్ననర్సింహులు, పాముట గంగయ్య, కాసుల పుల్లయ్య, అన్నం బాల నరసింహులు, కాసుల నాగయ్య, అట్ల పెదవెంకటరెడ్డి, అంబటి మాలకొండారెడ్డి, వటివేళ్ల రంగబాబు తదితరులు ఉన్నారు.