ప్రకాశం

ఘనంగా శ్రీనివాస కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరుగుమల్లి, నవంబర్ 18: మండల పరిధిలోని వర్దినేనిపాలెంలో నూతనంగా నిర్మించిన దేవస్థానంలో టీటీడీ వారిచే ఆదివారం సాయంత్రం శ్రీనివాస కల్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వాహకులు పోకూరి ముసలయ్య, శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణ మహోత్సవ వేడుకలు కొండపి ఎమ్మెల్యే స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జి పద్మావతి, శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, భక్తులకు తదితరులు పాల్గొన్నారు.

‘సమాజసేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకం’
గిద్దలూరు, నవంబర్ 18: సమాజసేవలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమైందని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఆదివారం వాసవీ క్లబ్ డిస్ట్రిక్-వి207ఏ జిల్లాసమావేశం స్థానిక విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ సమాజంలో ఏ అవసరం వచ్చినా సేవలో నిమగ్నమయ్యేది ఆర్యవైశ్యులేనని, ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఆర్యవైశ్యులు వాసవీక్లబ్, వాసవీ వనిత క్లబ్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసుకుని పేద ఆర్యవైశ్యులకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికి సేవలు అందించడంలో ముందుంటారని అన్నారు. ఆలయాల నిర్మాణాలు, పునరుద్ధరణ, ఆధ్యాత్మికంగా పని చేస్తుంటారని అన్నారు. అయినప్పటికీ సమాజంలో వీరు మాటపడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ఎంత సేవ అందిస్తున్నారనేది గుర్తుంచుకోవాలని అన్నారు. విపత్తుల సమయంలో వాసవీక్లబ్‌లు బాధితులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు ఎల్లవేళల తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. వాసవీక్లబ్ డిస్ట్రిక్-వి207ఎ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు ఐతా రాములు మాట్లాడుతూ మహిళల సహకారం లేనిదే ఏ కార్యక్రమమైనా మనం పూర్తి చేయలేమని, వాసవీ క్లబ్‌లు సేవకు మారుపేరన్నారు. బాదం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్యులు అన్నివర్గాలకు సహకారం అందిస్తున్నారన్నారు. ఏడాదిన్నర కాలంలో తనకు సహకారం అందించిన గవర్నర్ బాదం వెంకటేశ్వర్లు క్లబ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
* మార్కాపురం వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్‌గా వెంకటప్రసాద్
వాసవీ క్లబ్ డిస్ట్రిక్-వి207ఏ గవర్నర్‌గా వెంకటప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక సందర్భంగా వెంకటప్రసాద్ ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నికల కన్వీనర్ ఎస్.ఉమాదేవి వెంకటప్రసాద్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాదం గోపాల్, మాజీ సర్పంచ్ వెంకటసుబ్బయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ నరసింహులు, డైరెక్టర్ నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు ఎస్ చెంచయ్య పాల్గొన్నారు. అనంతరం అన్నా రాంబాబును శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.