ప్రకాశం

ఆధునిక పరిజ్ఞానంతో నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 19: నేరాలను అరికట్టడానికి ఆధునిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అన్నారు. ప్రకాశం జిల్లాలో ఫిన్స్ (్ఫంగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్), వెహికిల్ జీపీఎస్ సిస్టమ్స్‌ను జిల్లా ఎస్‌పి బి సత్య ఏసుబాబు సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఫిన్స్ విధానంలో నేరస్తుల, అనుమానితులకు చెందిన ఫింగర్ ప్రింట్స్‌ను లైవ్ స్కానర్ ద్వారా ఆన్‌లైన్‌లో డేటాబేస్‌తో సరిపోల్చి వెంటనే ఫలితం రాబట్టవచ్చని ఎస్‌పి తెలిపారు. ఈ ఫిన్స్ నెట్‌వర్కింగ్ సిస్టమ్ విధానం ద్వారా నేరస్తులను గుర్తించడం, అనుమానితులకు చెందిన నేర చరిత్ర తెలుసుకోవడం, నేరాలను నిరోధించడం, ప్రభావంతమైన నిఘా ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా పోలీసు వ్యవస్థలో టెక్నాలజీ ఉపయోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. సాధారణంగా ఎవరైనా అనుమానితుల గురించి తెలుసుకునేందుకు అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అతని వేలిముద్రలు పేపర్ మీద గాని, లేక స్కానర్ ద్వారా స్కాన్ చేసి సేకరించి వాటిని ఫింగర్ ప్రింట్ బ్యూరో యూనిట్‌కి పంపి, వారి ద్వారా ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందని ఎస్‌పి తెలిపారు. ఈ విధానం కొంత ఆలస్యంతో కూడుకున్న పనే కాకుండా, అనుమానితుడు ఇన్నోసెంట్ అయిన సందర్భంలో అతనికి అసౌకర్యం కలుగుతుందని ఎస్‌పి తెలిపారు. ఫిన్స్ సిస్టమ్ ద్వారా ఉత్సవాలు, పుష్కరాలు, తిరునాళ్లు, బహిరంగ సమావేశాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి జనసమర్ధమైన, నేరాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉండే ప్రదేశాలలో, రాత్రి పూట గస్తీ సమయంలో అనుమానితులను, నేరస్తులను గుర్తించేందుకు వెంటనే వీలు కలుగుతుందని ఎస్‌పి తెలిపారు. వారి వేలిముద్రలు అదే ప్రదేశం నుంచి మొబైల్‌కి అనుసంధానించి ఇచ్చిన లైవ్ స్కానర్ ద్వారా, ఆన్‌లైన్ డేటా బేస్‌లో నిక్షిప్తమై ఉన్న సుమారు 8 లక్షల పూర్వ నేరస్తులకు చెందిన వేలి ముద్రలతో సరిపోల్చి చూసి వెనువెంటనే ఫలితాలు పొందగలుతామని ఎస్‌పి తెలిపారు. దీనివలన నేరస్తులను వెంటనే అదుపులోకి తీసుకొని నేరాలను నిరోధించగలుగుతామని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించగలుగుతామని తెలిపారు. అదేవిధంగా అమాయికులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా వారిని తక్షణం వదిలివేయవచ్చని ఎస్‌పి తెలిపారు. వెహికిల్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి ఎస్‌పి సత్య ఏసుబాబు మాట్లాడుతూ ఈ విధానంతో వాహనం ఉన్న సరైన ప్రదేశాన్ని కనుగొనవచ్చని, అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ (సత్వర స్పందన), సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడం, రాత్రిపూట గస్తీ విధానాన్ని సమీకృతం చేయడం, వాహనం తిరిగిన ప్రదేశాలను విశే్లషించడం, వాహనానికి చెందిన మైలేజ్ కౌంట్ చేయడం లాంటివి వెంటనే తెలుసుకోవచ్చని ఎస్‌పి తెలిపారు. ఈ విధానంలో పోలీస్ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ బిగించి, అన్ని వాహనాలను కంట్రోల్ రూం నుంచి మానిటర్ చేస్తూ ఉంటారని ఎస్‌పి తెలిపారు. ఏదైయినా రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదం, శాంతిభద్రతల సమస్య, దొంగతనాలు, ఈవ్ టీజింగ్, గొడవలు, ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది ఆ ప్రదేశానికి ఏ వాహనం దగ్గరగా ఉందో గుర్తించి ఆ వాహనాన్ని అలాంటి ప్రదేశానికి త్వరితగతిన పంపించేందుకు వీలవుతుందని ఎస్‌పి తెలిపారు. దీనివలన ఎక్కువ ప్రాణ, ఆస్తినష్టాలు జరగకుండా నివారించి, బాధితులకు సత్వర తోడ్పాటు అందిస్తామని ఎస్‌పి తెలిపారు. ఈ విధానం సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడంతోపాటు ప్రజలకు సత్వరసాయం అందించేందుకు, నేరాలు నిరోధించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని ఎస్‌పి సత్య ఏసుబాబు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో అడిషనల్ ఎస్‌పి, అడ్మిన్ కె లావణ్యలక్ష్మి, ఏఆర్ అడిషనల్ ఎస్‌పి టి శివారెడ్డి, డిసిఆర్‌బి డిఎస్‌పి మరియదాసు, సిసిఎస్ పోలీస్‌స్టేషన్ డిఎస్‌పి కెవెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.