ప్రకాశం

శనగ విత్తనాల కోసం రైతుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపి, నవంబర్ 19 : మండలంలో శనగ సాగుచేసే రైతులకు ప్రభుత్వం అందచేసే సబ్సిడీ విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో శనగ సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు అందక కార్యాలయం చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. అధికారులు సూచించిన తేదీల వారీగా విత్తనాలు సరఫరా కాకపోవడంతో నాలుగు పంచాయతీల రైతులకు వాయిదా వేశారు. విత్తనాలు కార్యాలయానికి సోమవారం రావడంతో ఆయా గ్రామాల రైతులు ఒక్కసారిగా చేరుకున్నారు. దీంతో వారిని అదపు చేయలేక అధికారులు వ్యవసాయశాఖ కార్యాలయ తలుపులు మూసివేశారు. శనగ విత్తనాలు విత్తుకునేందుకు సీజన్ కావడం, వర్షం పడి భూమి పదును కావడంతో ముందు విత్తనాలు పొందిన రైతులు విత్తుకున్నారు. మిగిలిపోయిన నాలుగు గ్రామాల రైతులు భూమిలో పదును ఆరిపోతే విత్తనాలు మొలకెత్తవని ఆందోళనతో కార్యాలయానికి వందల సంఖ్యలో తరలి వచ్చారు.
ఇదిలావుంటే రాజకీయ నాయకులు పైరవీలు చేస్తుండటంతో శనగ విత్తనాలు బయటకు పోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాము వారం రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా విత్తనాలు అందలేదన్నారు. ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కావాలని అడుగుతున్నారని తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వచ్చే వరకు లైన్‌లోనే ఉండి జిరాక్స్ కాపీలు ఇస్తుంటే మధ్యాహ్నానికి శనగ విత్తనాలు అయిపోయాయని అధికారులు అంటున్నారని రైతులు వాపోయారు. శనగ విత్తనాల ధర పెరగడంతో రైతులు బయట మార్కెట్‌లో కొనుగోలు చేసే శక్తిలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విత్తుకునే రైతులకు శనగ విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.