ప్రకాశం

పేదరికం లేని సమాజమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, డిసెంబర్ 6 : రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ పర్యావరణశాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కల్యాణ మండపంలో నిర్వహించిన పేదరికంపై గెలుపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రూ.4 వేల కోట్లతో ఆదరణ పథకం కింద చేతి వృత్తుల వారికి పనిముట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయి రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుభవంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్రరాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. పేదల కోసం 50 శాతం సబ్సిడీపై ఆదరణ పథకం కింద పనిముట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఈ పనిముట్లను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఆరు వేల 124 మందికి రూ.49 కోట్లు, నియోజకవర్గంలో 781 మందికి రూ.6 కోట్ల 49 లక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడు ఆనందంగా పండుగ జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న కానుకలను అందజేస్తున్నట్లు తెలిపారు. చంద్రన్న పెళ్లికానుక పేరుతో పేదలందరికీ రూ.40 వేలు అందజేస్తుందన్నారు. ఎక్కడ చూసినా సీసీ రోడ్ల నిర్మాణం, సీ పోర్టుల అభివృద్ధి, ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతి పేదవానికి కడుపు నిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే రూ.5కే అన్న క్యాంటీన్లలో భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక నెల లోపు దర్శి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, రూ.200 ఉన్న పెన్షన్ రూ.వెయ్యి, వికలాంగులకు రూ.500 పెన్షన్ రూ.1500కు పెంచి ప్రతి నెలా 1వ తేదీన అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పసుపు, కుంకుమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కేంద్రం సహకరించకపోయినా, నిధులు లేకపోయినా రూ.50 వేల కోట్లతో ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని రాష్ట్రంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్భ్రావృద్ధి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఎస్టీలకు భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి చంద్రబాబునాయుడ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి రవి, ఆర్డీవో కెఎస్ రామారావు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీలు పూసల సంజీవయ్య, వెంకట్రావు, జడ్పీటీసీలు స్టీవెన్, కె నాగరాజు, ఎఎంసి మాజీ చైర్మన్ సూరే చిన్న సుబ్బారావు, వేతనం సంఘం డైరెక్టర్‌శోభారాణి, మండల ఉపాధ్యక్షుడు మారం శ్రీనివాసరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి కృష్ణవేణి , లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.