ప్రకాశం

ముఖ్యమంత్రి కార్యక్రమంలో విద్యార్థుల ఆకలికేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన ఆలస్యం కావటంతో విద్యార్థులు ఆకలికేకలతో అలమటించి పోయారు. జిల్లాకేంద్రం ఒంగోలులో బుధవారం జరిగిన జ్ఞానభేరి బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూలు ప్రకారం ఉదయం 11గంటలకు హాజరుకావలసి ఉండగా సుమారు రెండు గంటల ఆలస్యంతో 12.50కు వచ్చారు. మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి బహిరంగ సభ జరగటంతో ఉదయం 9.30నుంచి పదిగంటల సమయంలో బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్న కొందరు విద్యార్థులకు అల్పహారం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో కొందరు విద్యార్థులు ఇంటిబాట, కళాశాల బాట పట్టారు. వెనక్కి వెళ్లిపోతున్న కొందరు విద్యార్థులను విలేఖరులు ప్రశ్నించగా తాము ఉదయం వచ్చామని, కానీ 12.30గంటల వరకు కూడా చంద్రబాబు రాలేదని, తమకు అల్పహారం ఇవ్వలేదని, ఇంకా ఎప్పటివరకు ఉండాలంటూ ఎదురు ప్రశ్నవేస్తూ వెళ్లిపోయారు. ప్రభుత్వం జ్ఞానభేరి సభలను విజయవంతం చేసేందుకు కోట్లాది రూపాయలలు వెచ్చించింది.. ఒక్కొక్క బహిరంగ సభకు సుమారు పదికోట్ల రూపాయల వరకు ఖర్చుచేసినట్లు తెలుస్తొంది. కోట్లాధిరూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసినా సంబంధిత అధికారులు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అల్పహారం అందించకపోవటం విశేషం. ఆహారానికి సంబంధించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యవైఖరి కారణంగా కొంతమంది విద్యార్థులు ఇబ్బందిపడినట్లు తెలుస్తొంది.