ప్రకాశం

మార్టూరులో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, డిసెంబర్ 12: మార్టూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పార్టీ నాయకులు బుధవారం ఘనస్వాగతం పలికారు. అమరావతి నుంచి ఒంగోలులో జరిగే జ్ఞానభేరికి బయలుదేరిన ముఖ్యమంత్రి మార్టూరులో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. సూర్యలంక బీచ్‌లో క్షిపణి పరీక్షలు ఉన్నందున గగన విహారంపై ఆంక్షలు విధించటంతో 11.10 నిమిషాలకు ముఖ్యమంత్రి మార్టూరులో హెలీప్యాడ్‌కు చేరుకోగానే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, పోతుల రామారావు, దామచర్ల జనార్ధన్ , ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు అక్కడి నుంచి బస్‌లో ఒంగోలుకు చేరుకున్నారు.