ప్రకాశం

జిల్లాకు మళ్లీ అవే వరాల జల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు మళ్లీ పాతవరాలనే వల్లెవేశారు. జిల్లాకేంద్రం ఒంగోలులో బుధవారం జ్ఞానభేరి బహిరంగ సభ విద్యార్థులతో జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయి గతంలో జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా గతంలో కురిపించిన హామీలనే మళ్లీ గుప్పించారు. ప్రధానంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ మరొపక్క తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను విద్యార్థులకు వివరిస్తూనే మరొకపక్క కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గత నాలుగు జ్ఞానభేరిల కంటే ఒంగోలులో జరిగిన జ్ఞానభేరికి విద్యార్థులు భారీగా తరలి వచ్చారంటూ కితాబు ఇచ్చారు.
ప్రధానంగా జిల్లాలో నెలకొన్న కరువుపరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంఖుస్థాపన చేస్తానని, గుండ్లకమ్మ రిజర్వాయరును త్వరలో జాతికి అంకితం చేస్తానని ప్రకటించారు. నదుల అనుసంధానం ద్వారా ప్రకాశం జిల్లాలోని వెస్ట్రన్ డెల్టా రైతులకు నీరు అందుతుందన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ను, కనిగిరిలో నిమ్జ్, పల్ప్ ఇండస్ట్రీ, వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట యూనివర్సిటీకి శంఖుస్థాపన చేశామన్నారు. జిల్లాలోని విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమప్రాంతానికి చెందిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. తానే ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశానని, తానే పూర్తిచేస్తానని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. జిల్లాకు ఉన్న ఏడు జాతీయ రహదారులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధానంగా వాన్‌పిక్ వ్యవహరాన్ని ప్రస్తావించారు. వాన్‌పిక్‌పై ఉన్న వ్యతిరేక అంశాలపై దృష్టిసారించి ఆ సమస్యల పరిష్కారం ద్వారా పరిశ్రమలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు.
ఉదయం 11గంటలకు జ్ఞానభేరి బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరు కావలసి ఉండగా 12.50గంటలకు సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి విచ్చేసారు. అయినప్పటికీ విద్యార్థులు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు. బహిరంగసభ వేదిక వద్దకు వచ్చేసమయంలో చంద్రబాబు విద్యార్థులకు అభివాదం చేయగా విద్యార్థుల నుంచి విశేషస్పందన లభించింది. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆయనకు సంఘీభావం తెలిపారు. ఆయన ప్రసంగం మొదట విద్యార్థులను ఉద్ధేశించి మొదలయి అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దృష్టి సారించి ప్రసంగించారు. ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి విద్యార్థులను చైతన్యవంతం చేయటంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. రాష్టవ్రిభజన సమయంలో విద్యార్థులు అనేక ఆందోళనలు చేశారంటూ వారికి కితాబు ఇచ్చారు.
బహిరం సభకు ముందు సభాస్థలి వద్ద విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. మొత్తంమీద తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఒటమిపాలైనప్పటికీ ఆ హావాభావాలు ఏమీ రాకుండానే విద్యార్థులతో మమేకమై ఆనందంగా, ఆహ్లాదంగా విద్యార్థులతో గడపటం విశేషం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో విజయవంతం చేయటంలో జిల్లాయంత్రాంగం సఫలీకృతమైంది. మొత్తంమీద ముఖ్యమంత్రి పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతం కావటంతో జిల్లా యంత్రాంగం, రాజకీయ ప్రముఖులు ఊపీరి పీల్చుకున్నారు. జ్ఞానభేరి సభలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాం, పోతుల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, కదిరి బాబురావు, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తి డేవిడ్‌రాజు, మాజీ డీజీపీ మాలకొండయ్య, కలెక్టర్ వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ఉపకులపతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.