ప్రకాశం

జిల్లాలో తుదిఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 14:జిల్లాలో తుది ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించి సమగ్రంగా ప్రచురించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల రోల్ అబ్జర్వర్ పీయూష్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్ధానిక సిపిఒ సమావేశమందిరంలో ఓటరునమోదు అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులతో ప్రత్యేక సంక్షిప్త సవరణ -2019పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వచ్చే జనవరి నాల్గవతేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉందన్నారు. ఓటర్ల చేర్పులు, మార్పులు కోసం వచ్చిన ధరఖాస్తులను సమగ్రంగా విచారణ జరపాలని అర్హులైన ఓటర్లకు ఓటుహక్కు కల్పించేలా చూడాలని ఇఆర్‌ఒలనుర, ఏఇఆర్‌ఒలను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో ఓట్లతొలగింపులను పూర్తిస్ధాయిలో విచారణ జరిపిన అనంతరమే తొలగింపుల పక్రియను పూర్తిచేయాలన్నారు. ఎలక్టోరల్‌రోల్ లాజికల్ తప్పులను పరిశీలించి సవరించాలన్నారు. కాల్ సెంటరుకు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. నియోజకవర్గాల వారీగా రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తుది ఓటర్ల జాబితా తయారు చేయటంలో సహకరించేలా చూడాలన్నారు.
ఓటర్ల జాబితాలో కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఉండేలా చూడాలని డోర్‌నెంబర్లు లేని ప్రాంతాలను గుర్తించి డోర్ నెంబర్లు వేసే ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఆయా నియోజకవర్గాల్లో అసాధారణంగా ఉండకుండా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విభిన్నప్రతిభావంతుల ఓటర్లను గుర్తించి ఆయా పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేకవసతులు కల్పించేలా చూడాలన్నారు. ఓటర్ల చేర్పులు, మార్పులు తొలగింపుల పక్రియ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.
కలెక్టర్ వి వినయ్‌చంద్ మాట్లాడుతూ తొలగింపుల ఓటర్లకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేపట్టి మాత్రమే తొలగింపు పక్రియ చేపట్టాలని ఇఆర్‌ఓ, ఎఇఆర్‌ఓలను ఆదేశించారు. తుది జాబితా రూపొందించటంలో ప్రలోభాలకు లొంగకుండా కచ్చితమైన తుదిజాబితా తయారు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పెండింగ్‌లోని క్లెయిమ్‌లన్నింటిని పరిష్కరించి డేటా ఆప్‌డేట్ చేయాలన్నారు. తుదిఓటర్ల జాబితా తయారుచేయటంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇఆర్‌ఓ, ఎఇఆర్‌ఓలపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులతో సమీక్ష నిర్వహించుకుని బోగస్‌ఓటర్లు, డెత్‌ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లపై సమగ్రవిచారణ జరిపి జాబితా తయారుచేసేలా చూడాలన్నారు. హౌస్‌హోల్డ్, డోర్‌టూ డోర్ వెరిఫికేషన్‌ను పక్కాగా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బూత్‌లెవల్ అధికారులు చేపట్టిన ఎంట్రీలపై ప్రత్యేక దృష్టిసారించి క్షుణ్ణం గా పరిశీలించాలన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్‌డిఒలు, కలెక్టరేట్‌లోని హెచ్ విభాగం పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

మోకాళ్లపై నిలబడి వెలుగు ఉద్యోగుల వినూత్న నిరసన
ఒంగోలు అర్బన్,డిసెంబర్ 14: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వెలుగు ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత 15రోజులనుండి వివిధ రూపాల్లో వెలుగు ఉద్యోగులు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్న వారి సమస్యలు పరిష్కారంకాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్ని రెగ్యూలర్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వెలుగు ఉద్యోగులు కీలకపాత్రపోషిస్తున్నారని అలాంటివారిచేత వెట్టిచాకిరీ చేయిస్తూ వారి కష్టాన్ని దోపిడి చేస్తున్నారని విమర్శించారు. వెంటనే వెలుగు ఉద్యోగులందర్ని రెగ్యూలర్ చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈదీక్షలకు ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్ కె కృష్ణ, జిల్లానాయకులు జి బ్రహ్మాం, కె భవానీప్రసాదు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈకార్యక్రమంలో వెలుగు ఉద్యోగుల జెఎసి నాయకులు నరేంద్ర, వెంకట్రావు, వెంకటస్వామి, శౌరీ, రాజారావు, అంజిరెడ్డి,బ్రహ్మాయ్య, వీరయ్య, ఇందిర, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

పెథాయ్ తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి
సిద్ధంగా ఉండాలి
ఒంగోలు - విశాఖపట్నం మధ్య తీరం దాటనున్న వాయుగుండం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, డిసెంబర్ 14 : జిల్లాలో రానున్న పెథాయ్ తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో తుఫాన్ ప్రభావిత మండలాల్లో ప్రజల ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వాయుగుండం ప్రభావం శనివారం సాయంత్రం నుండి ఉంటుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ సమాచారం తెలియజేసేందుకు కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 14 మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గేంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలోని 14 కోస్తా తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, టంగుటూరు, శింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు, జరుగుమల్లి , కొత్తపట్నం , నాగులుప్పలపాడు, చిన్న గంజాం, వేటపాలెం, చీరాల , కారంచేడు, కందుకూరు, సంతనూతలపాడు మండలాలు తుఫాన్ తాకిడికి గురి అవుతాయని గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో తుఫాన్ తీవ్రతకు గురైయ్యే మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారుతుందన్నారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఒంగోలు, విశాఖపట్నం మధ్యలో వాయుగుండం తీరం దాటుతుందని తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో తీవ్ర ఈదురు గాలులు వీస్తాయన్నారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుండి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు. శనివారం మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోస్తా తీరం లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కోస్తాతీర గ్రామాల్లో లోతట్లు ప్రాంతాలను గుర్తించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకు రావాలని ఆయన తెలిపారు. కోస్తాతీర ప్రాంతాల్లో గర్భిణీ స్ర్తిలు, చిన్న పిల్లలు, వృద్దులు, వికలాంగులను ప్రత్యేకంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకు రావాలన్నారు. కోస్తా తీర గ్రామాల్లో కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేయాలన్నారు. సురక్షిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు గ్రామాల్లో మధ్యాహ్నం భోజనం వండే వారితో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈదురు గాలులకు రోడ్లకు అడ్డంగా పడే చెట్లను తొలగించేందుకు జెసిబి మిషన్లు, పవర్‌సాలు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్ ఆయిల్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా కు అంతరాయం కలుగకుండా పోల్స్ సిద్దంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ సుబ్బరాజును ఆదేశించారు. కోస్తాతీర గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూయస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రభలకుండా పారిశుద్య పనులు ముమ్మరంగా చేపట్టాలని డిపివోను ఆదేశించారు. గ్రామస్థాయి అధికారులందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా రెవెన్యూ అధికారి కె వెంకట సుబ్బయ్య, స్టెప్ సిఈవో బి రవి, వ్యవసాయ శాఖ జెడి శ్రీరామ్మూర్తి, మత్స్యశాఖ జెడి బలరాం, డిఆర్‌డిఏ పీడీ నరసింహులు, జన వనరుల శాఖ ఎస్‌ఈ రవి, జిల్లా పంచాయితీ అధికారి ప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, సర్వ శిక్షా అభియాన్ పిడి ఎం వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణశాఖ పీడీ సాయినాధ్‌కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ బోల్తా పడి యువకుని మృతి
పర్చూరు, డిసెంబర్ 14:ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో అడుసుమల్లి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మేకా బాబూరావు(25) మృతిచెందాడు. గ్రామస్ధులు, బంధువుల కధనం మేరకు మృతుడు బాబూరావు ట్రాక్టర్ నడుపుకుంటూ సాకివాగు సమీపంలోని పొలానికి వెళుతుండగా సాకి వాగు బ్రిడ్జి మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తాపడి కాలువలోకి దూసుకు వెళ్ళడంతో బాబూరావు ట్రాక్టర్ కిందపడిపోయాడని తెలిపారు. కొన ఊపిరితో ఉన్న ఇతన్ని ప్రవేటు వాహనంలో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడని తెలిపారు. అక్కరకు వచ్చిన కుమారుడు ప్రమాదవశాత్తు మృతిచెందటంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు.