ప్రకాశం

కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 14 : జిల్లాలో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలను కలెక్టర్ వి వినయ్‌చంద్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ముగ్గురు ఉద్యోగులకు రెవెన్యూశాఖలో కేటాయించారు. అందులో భాగంగా ప్రకాశం భవనంలోని కలెక్టర్ కార్యాలయంలో అనూష, వౌనికకు జూనియర్ అసిస్టెంట్లుగా, కోటేశ్వరరావుకు చీరాల తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌వోగా కేటాయిస్తూ నియామక పత్రాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి అమీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న
238 మందిపై కేసులు నమోదు
23 మందికి జైలు శిక్ష
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 14 : జిల్లాలో ఈనెల 7వ తేది నుండి 14వ తేది వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 238 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌పి బి సత్య ఏసుబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని దీని వలన ప్రాణ, వ్యక్తిగత, ఆస్తినష్టాలు జరుగుతున్నాయన్నారు. వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ అధికారులు వారి వారి ప్రాంతాల్లో వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో వారం రోజుల్లో 238 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, వారిని గుర్తించి ఎంవి యాక్టు సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. వారితో పాటు పెండింగ్‌లో ఉన్న 115 మందిని కోర్టులో హాజరు పర్చగా 23 మంది వాహనదారులకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. మిలిగిన వారికి జరిమానా విధించారని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక లక్షా 61 వేల 500 రూపాయలను న్యాయమూర్తి జరిమానా విధించారన్నారు. వాహనచోదకులు మద్యం సేవించి వాహనాలు నడుప వద్దని, అలా నడిపితే శిక్షలు తప్పవని హెచ్చరించారు.

వైకాపా తీర్థం పుచ్చుకోనున్న
మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు
ఇంకా ఖరారు కాని టిక్కెట్

ఒంగోలు,డిసెంబర్ 14: గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ మేరకు అన్నా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మాజీ మంత్రి, ఒంగోలుపార్లమెంటు వైకాపా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇటీవల కొన్ని రోజుల క్రితమే బాలినేనితో అన్నా ఒంగోలు, హైదరాబాదులో మంతనాలు సాగించినట్లు తెలుస్తొంది. అన్నా చేరికపై వైకాపా రాష్ట్రఅధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్నినట్లు సమాచారం. ఈనేపధ్యంలో అన్నా చేరిక లాంఛనమే అయింది.
కాగా గిద్దలూరు నియోజకవర్గ టిక్కెట్‌పై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తొంది. ఈనేపధ్యంలో ముందుగాపార్టీలోకి చేర్చుకుని ఆతరువాత పరిస్ధితులను బట్టి టిక్కెట్ కేటాయిస్తారా లేక పార్టీకోసం వాడుకుంటారా అనేది త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి.
ఇదిఇలాఉండగా ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఐవి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈపాటికే ఐవిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.రాష్టప్రార్టీ ఆదేశాను సారం ఏ పార్టీకార్యక్రమమైన ముందుగా నియోజకవర్గంలోకి తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సందర్బంలో రానున్న ఎన్నికల్లో ఐవి రెడ్డికి టిక్కెట్ కేటాయిస్తారా లేక అన్నా రాంబాబుకు కేటాయిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందనే చెప్పవచ్చు. అన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరితే ఆపార్టీకి ఆదనపు బలం వచ్చినట్లే అవుతుందని పార్టీముఖ్యనాయకులు విశే్లషిస్తున్నారు. ఇప్పటివరకు వైశ్యసామాజికవర్గానికి చెందిన ముఖ్యనాయకులు వైసిపిలో జిల్లాలో లేరు. ప్రస్తుతం అన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరటంతో వైశ్యవర్గం ఓట్లు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశంపార్టీ తరుపున రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు బలమైన నాయకుడిగా ఉన్నారు. మొత్తంమీద వైశ్యవర్గానికి ఇరుపార్టీల్లోను ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుంది.
ఇదిఇలాఉండగా చీరాల నియోజకవర్గంలోను వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీలో త్వరలో మార్పులు జరిగే అవకాశాలులేకపోలేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం చీరాల నియోజకవర్గంనుండి తెలుగుదేశంపార్టీ తరుపున ఆమంచి కృష్ణమోహన్ శాసనసభ్యునిగా ఉన్నారు. ఆమంచిని ఢీకొట్టే నేతను త్వరలోనే వైకాపా రాష్ట్రఅధిష్టానవర్గం తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద గిద్దలూరు నియోజకవర్గంనుండి అన్నా రాంబాబు శనివారం మాజీ మంత్రి బాలినేని సమక్షంలో వైకాపా తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.