ప్రకాశం

పంచాయతీల్లో ప్రత్యేక పాలనపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 14 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, ప్రత్యేక అధికారుల పాలనపై సర్పంచ్‌ల సంఘం, జాతీయ లోకల్ బాడీ ఛాంబర్ తదితరులు దాఖలు చేసిన పిటీషన్‌పై ఈనెల 19న హైకోర్టులో తుది విచారణ జరుగుతుందని సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జి వీరభద్రాచారి తెలిపారు. శుక్రవారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అక్టోబర్ 23న పంచాయతీ ఎన్నికలు, ప్రత్యేక పాలనపై సింగిల్ కోర్టు జడ్జి ఇచ్చిన ఆదేశాలు, జీవో 90ను రద్దు చేసినప్పటికీ ప్రత్యేక పాలనను కొనసాగించడం చట్టవిరుద్ధమని, 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జులుగా కొనసాగింపు వీలుపడదని, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దావాలు మొత్తం రాష్టస్థ్రాయిలో 13తో కలిపి ఈ నెల 19న తుది తీర్పుకు హైకోర్టు ఇస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సమాచారం కోర్టుకు సమర్పించ లేదని దాదాపుగా ఈనెల 19వ తేదిన హై కోర్టు తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 90 రోజుల్లో ఎన్నికల్లో నిర్వహించాలన్న కోర్టు తీర్పు ఇచ్చి 45 రోజులు కావస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎలాంటి ఆటంకం లేదని, ప్రభుత్వం కావాలనే ఎన్నికల జాప్యం కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు. సర్పంచ్‌ల సంఘం అప్పీలుతో ఎన్నికలు నిర్వహించాలని, లేదా నిర్వహించేంత వరకు పంచాయతీల్లో సక్రమ పాలన, ప్రజాహితం కోసం సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జులుగా కొనసాగించాలనే వాదన, అభ్యర్థనను న్యాయ స్థానం ముందు ఉంచుతామన్నారు. సర్పంచ్‌ల సంఘం తరుపున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తారని తెలిపారు.

ఆజాద్ జాతీయ పురస్కారం కోసం
దరఖాస్తులు ఆహ్వానం
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 14 : యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థుల నుండి 2018-19 సంవత్సరానికి సంబంధించి వౌలానా ఆజాద్ జాతీయ పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సయ్యద్ సిరాజుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేసుకోవాలని ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. యూనివర్సిటీల్లో చదువుతున్న ఎంఫిల్, పిహెచ్‌డి, రెగ్యులర్ అభ్యర్థులు అర్హులని, యూజిసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కాలేజీల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు అర్హులన్నారు. 2017 డిసెంబర్, ఈ సంవత్సరం జూన్‌లో పాసైన వారు అర్హులన్నారు. యూనివర్సిటీల్లో చదువుతున్న అర్హులైన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శరవేగంగా నిర్మితమవుతున్న పేదల గృహాలు
ఎన్నికల్లోపే పేదలకు గృహాలు అందించే అవకాశం
అద్దంకి, డిసెంబర్ 14: అద్దంకి పట్టణంలో పేదల కోసం శింగరకొండ వద్ద నిర్మితమవుతున్న పేదల గృహాలు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పేదలకు ఇళ్ల కోసం చూసిన ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. పట్టణంలోని పేదలు ఇంటిస్థలాల కోసం ధరఖాస్తులు చేసుకున్నప్పటికీ, ఇంటిస్థలాలకు జాగా లేకపోవడంతో శింగరకొండ వద్ద జిప్లస్‌త్రి గృహాలు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు తెప్పించి జిప్లస్‌త్రి నిర్మింపచేస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం 800 కుటుంభాలు ఉండేవిధంగా సింగిల్‌బెడ్‌రూమ్, డబుల్‌బెడ్‌రూమ్ గృహాలు నిర్మిస్తున్నారు. దరఖాస్తుదారులు కోరుకున్నదానినిబట్టి వారికి బ్యాంకు రుణం అందించి నెలవారీగా బ్యాంకుకు వాయిదా సొమ్ము చెల్లించే విధంగా నిబంధనలతో గృహాన్ని అందిస్తారు. శింగరకొండ వద్ద నిర్మిస్తున్న జిప్లస్‌త్రి గృహాలు శరవేగంగా నిర్మించి, మరో మూడు నెలల్లో లబ్దిదారులకు గృహాలను అప్పచెప్పేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలోపే పేదలకు గృహాలు అందించే అవకాశం ఉంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకవైపు డిగ్రీ కాలేజి, పక్కనే పాలటెక్నిక్ కాలేజి, ఎదురుగా ఎంబిఎ కాలేజి, కూతవేటు దూరంలో శ్రీప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం కలిగి ఉన్న ఈప్రాంతంలో రాబోయే రోజుల్లో సుమారు మూడు నుండి నాలుగు వేల కుటుంబాలు నివశించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అద్దంకి పట్టణంలో నివాశిత స్థలంగాని, గృహం గాని లేకుండా ఉన్న పేదలందరికి ప్రభుత్వం గృహ సదుపాయం కల్పిస్తున్నది. పేదల గృహాలకు మంచినీటి ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు తదితర వౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఏది ఏమైనా అద్దంకిలో పేదలకు సొంతింటి కల త్వరలో నెరవేరనుంది.

రాఫెల్ కుంభకోణంపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు
- బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 14 : రాఫెల్ యుద్ధ విమానాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన నిరాధారమైన ఆరోపణలకు చెంపపెట్టుగా సుప్రీం కోర్టు ధర్మాసనం న్యాయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని సుప్రీం కోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించి రాఫెల్ విమానాల అగ్రిమెంట్‌ను బహిర్గతంగా ఎవ్వరికీ తెలియాల్సిన పనిలేదని, ఏవైతే దాఖలైన 36 పిటీషన్‌లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టి వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ పరువును ప్రపంచ దేశాలకు తాకట్టు పెట్టే విధంగా మాట్లాడుతుందని విమర్శించారు. 20 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కనీసం దేశ భద్రత గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించ లేదన్నారు. ప్రస్తుతం నిస్వార్థంగా ఎలాంటి అవినీతి లేకుండా దేశ ప్రధాని మోదీ దేశాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఏదో ఒక విధంగా కనుమరుగు అవుతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ లేనిపోని నిందలు మోపి భారత దేశ పరువును తీయడం సిగ్గు పడాల్సిన అంశమన్నారు. దీనికి వంతుగా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్లు రాఫెల్‌కు అర్ధం తెలియకపోయినా మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. పక్కనే ఉన్న తెలంగాణాను అన్నీ రంగాల్లో కెసిఆర్ అభివృద్ధిపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగున్నర సంవత్సరాల కాలంలో దోచుకునేదే ధ్యేయంగా రాష్ట్రాన్ని నాశనం చేసి పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని రాష్ట్రంపై దృష్టి సారించాలన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి మీనాకుమారి, కనుమాల రాఘవులు, ఓబిసి మోర్చ జిల్లా అధ్యక్షులు టి సురేష్, నాయకులు శ్రీమన్నారాయాణ, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.