ప్రకాశం

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 21: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈనెల 26న ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో మీకోసం కార్యక్రమం అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆమె జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నూతన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్టాళ్లు, శకటాలు తయారుచేయాలని సూచించారు. దేశభక్తి, దేశ సమగ్రతను చాటిచెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించే పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌ను వేడుకల నిర్వహణకు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా అసెట్ డిస్ట్రిబ్యూషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభకనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసేందుకు అధికారులు సిబ్బంది పేర్లను ఈనెల 22వ తేదీలోపుగా కలెక్టరేట్‌కు సమర్పించాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు తాగునీటివసతి కల్పించేలా చూడాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. ఈనెల 20వ తేదిన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగేలా చూడాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. ఈ నెల 23న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా యువతను చైతన్య పరిచేందుకు 3కె రన్ నిర్వహించేలా చూడాలన్నారు. ఓటు హక్కు కలిగిన వారందరినీ జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొనేలా చూడాలని ఆమె కోరారు. ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో ఈ నెల 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంతో పాటు ప్రతిజ్ఞ ఉంటుందని ఈ కార్యక్రమంలో అధికారులు, యువత , ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించామని, ఆ పోటీల్లో గెలుపొందిన వారికి ఈనెల 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పెద్దఎత్తున యువత పాల్గొనేలా చూడాలని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన శకటాన్ని రూపొందించాలని, అదే శకటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వినియోగించాలని స్టెప్ సీఇవోకు ఆమె సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 డి మార్కండేయులు, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి వి వెంకటసుబ్బయ్యతో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ముందుగా మీ కోసం కార్యక్రమాన్ని సీపీవో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. మీ కోసం ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మీ జిల్లా అధికారులను ఆదేశించారు.