ప్రకాశం

ముగ్గురు రక్షక్ వాహన డ్రైవర్లు సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 7: రక్షక వాహనాల కండీషన్ సరిగా లేదని, సరిగా మైలేజీ రావటం లేదని కోటా కంటే ఎక్కువ డీజిల్ తీసుకొని దుర్వినియోగం చేసినందుకు గాను జిల్లా ఎస్‌పీ సత్యఏసుబాబు ముగ్గురు రక్షక వాహన డ్రైవర్లను విధుల నుండి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో రక్షక వాహన డ్రైవర్లుగా పనిచేస్తున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఎన్ ప్రవీణ్‌కుమార్, హోమ్‌గార్డు కె కిషోర్, ఒంగోలు రెండవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో రక్షక వాహన డ్రైవర్లుగా పనిచేస్తున్న ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ టి నరసింహరావులు రక్షక వాహనాలు సరైన కండీషన్ లేవని మైలేజీ రావటం లేదని చెప్పి వారికి ఇచ్చిన కోటా కంటే ఎక్కువ డీజిల్ తీసుకొని దుర్వినియోగం చేసినందుకు రికార్డులో తప్పుగా ఎంట్రీ చేసినందుకు పీసీ అండ్ ఏ రూల్స్ కింద పై ముగ్గురిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్‌పీ సత్యఏసుబాబు గురువారం ఓ ప్రకటలో తెలిపారు.