ప్రకాశం

ఆమంచి వైసిపిలోకి వస్తే అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఫిబ్రవరి 7: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు ప్రచారం కేవలం అభూతకల్పనేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి స్పష్టం చేశారు. గురువారం ఆయన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆమంచి వైసీపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తెలుగుదేశంలో ఉంటే చీరాల సీటు వస్తుందో రాదో అనే సందేహంలో ఉన్న ఆయన వైఎస్సార్‌సిపిలో తాను చేరబోతున్నట్లు ప్రచారం చేసుకుని టీడీపీ సీటు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనపై ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు టీడీపీపై తీవ్ర వత్తిడి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన మద్దతు ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సిపితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వైసీపీలోకి వస్తే నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని ఆత్మత్యాగానికైనా సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్న వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలుచేయడానికి టీడీపీ నాయకులు ఆమంచి ద్వారా అయోమయానికి గురిచేసే పద్దతులు మానుకోవాలని అన్నారు. అధిష్టానం ఇకనైనా స్పందించి చీరాల అభ్యర్ధిని ప్రకటించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కర్నేటి రవికుమార్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పేర్లి నాని, ఎన్. రాజ్‌కుమార్, కె. కిషోర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.