ప్రకాశం

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర సీనియర్ ఎన్నికల సంఘం కమిషనర్ ఉమేష్ సిన్హా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఢిల్లీనుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలింగ్ ప్లానింగ్‌ను అమలుచేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు అవసరమైన ఎన్‌జీఓలను, ఎన్‌సిసి సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్‌స్ధాయి అధికారులను నియమించాలన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. సాధారణ పౌరులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అర్హతకలిగిన వారికి ఓటు హక్కు ఉందా లేదా అనేవిషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో అర్హతకలిగిన వారికి ఓటుహక్కును కల్పించాలన్నారు. అర్హులైన వారికి ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన కాల్‌సెంటర్ ద్వారా ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను వెంటనే ఎన్నికల సంఘానికి పంపాలన్నారు. ఒంగోలునుండి వీడియోకాన్పరెన్స్‌లో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 24లక్షల 95వేల 383మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో పురుషులు 12లక్షల 43వేల 411మంది,మహిళలు 12లక్షల 51వేల 823మంది , 149మంది హిజ్రాలు ఓటర్లుగా ఉన్నారని వివరించారు. జిల్లాలోని పట్టణప్రాంతాల్లో 486 పోలింగ్‌కేంద్రాలు, గ్రామీణప్రాంతాల్లో 2783 కేంద్రాలతో కలిపి మొత్తం 3,267 ఉన్నాయన్నారు. జిల్లాలో ర్యాంపుసౌకర్యంలేని పోలింగ్ కేంద్రాలు 677, విద్యుత్ సరఫరాలేనివి 390, తాగునీటి సౌకర్యం లేనివి 314, టాయిలెట్ సౌకర్యం లేనివి 221 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంప్‌సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియోకాన్పరెన్స్‌లో జిల్లా ఎస్‌పి సత్యఏసుబాబు, జిల్లా రెవిన్యూఅధికారి తదితరులు పాల్గొన్నారు.