ప్రకాశం

పొదిలిలో పోలీసుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, ఫిబ్రవరి 7 : రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం పొదిలి పట్టణంలో పోలీసులు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఆటో వర్కర్స్‌తో కలిసి పోలీసులు పట్టణ పురవీధుల్లో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా పొదిలి సి ఐ చిన్న మీరా సాహెబ్ మాట్లాడుతూ రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఇందు వలన ఎక్కువ శాతం ప్రమాదాలను నివారించవచ్చునని ఆయన తెలిపారు. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు, ఇతర వాహనాలు నడిపే వాహనదారులు సీటు బెల్టు ధరించాలని, ఆజాగ్రత్త , నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం ద్వారా వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటం కూడా ప్రమాదాలకు ఒక ముఖ్య కారణమని సి ఐ తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలు అతిక్రమించే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సి ఐ తెలిపారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించవద్దని ఆయన డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ ఐ టి శ్రీరామ్, సిబ్బందితో పాటు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గౌస్ పాల్గొన్నారు.

మాదిగలను అణగతొక్కేందుకు యత్నిస్తున్న రాజకీయ పార్టీలు
గిద్దలూరు, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు లేరని దుష్ప్రచారం చేస్తున్నారని, రాజకీయ పార్టీలు మాదిగలను అణగతొక్కే యత్నం చేస్తున్నాయని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గిద్దలూరు నియోజకవర్గ స్థాయిలో మాదిగల విశ్వరూప సమాయత్త సభ ఎపిఎం పాలెంలోని చిల్డ్రన్స్‌పార్కులో గురువారం జరిగింది. ఈకార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాదిగల ఆశ ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, నేడు రాష్ట్రంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధుల పెన్షన్ల మంజూరు ఎంఆర్‌పిఎస్ ఎన్నో పోరాటాల ఫలితమేనని మందా కృష్ణమాదిగ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు లేరని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈరాష్ట్రంలో మాదిగలు లేక ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను అణగతొక్కే యత్నం చేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్న నాలుగు ఎస్సీలకు సంబంధించిన పదవులను మాలలకు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ, దళిత క్రైస్తవుల కార్పొరేషన్ చైర్మన్, నాలుగు పార్లమెంటు స్థానాలు కూడా రెండు ఎస్సీ మాదిగ ఉప కుమాలలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే విధంగా మరోమాదిగ విశ్వరూప మహాసభను రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈనెల 19న నిర్వహిస్తున్నామని, ఈ సభను జయప్రదం చేయాలని మందా కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్‌ఛార్జి సూరెపోగు శ్యాంమాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి షాలెంమాదిగ, కొండపోగు దేవప్రభాకర్ మాదిగ, గుర్రం బాబూరావు మాదిగ, లక్ష్మయ్య మాదిగ, పందీటి రజనీకుమార్, బి ప్రసాద్, కె వెంకటేశ్వర్లు, పి ఎర్మియా, ఆరు మండలాల మాదిగలు పాల్గొన్నారు.

వ్యాపార వర్గాల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

ఒంగోలు,్ఫబ్రవరి 7: బహుళజాతి సంస్ధలైన డీమార్ట్, వాల్‌మార్ట్‌లాంటి సంస్ధలను చిల్లర వర్తకంలోకి అనుమతించిన కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు వ్యాపారుల నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.
రావాలి జగన్... కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్ధానిక 25వడివిజన్‌లోని భీమరాజువారి వీధి, గాంధీరోడ్డు, పత్తివారివీధి, బండ్లమిట్ట, బండారు పాలెం, దోమలపాలెం, బాలాజీరావుపేట, బొంగినవారి వీధీలో బాలినేని పర్యటించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ ఒక వైపు గ్రామాల్లో రేషన్‌దుకాణాల స్ధానంలో రిలయన్స్, ఫూచర్ గ్రూపు కంపెనీలతో విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా కొద్దిపాటి కొనుగోలు శక్తి కలిగిన వాళ్ళంతా మాల్స్‌కు వెళ్ళటంతో చిన్న వ్యాపారులు దెబ్బతిన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, పార్టీనాయకులు వేమూరి బుజ్జి, కెప్రసాదు, ఎన్ బాలు, వి శ్రీను, కె కిశోర్, సత్యం, ఎం కృష్ణ, అయ్యప్ప, వినయ్‌కుమార్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసుకోడానికి వీలుగా

నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి
ఒంగోలు, ఫిబ్రవరి 7: 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసుకొని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం నాడు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈదా సుధాకర రెడ్డి మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు జిల్లాలోని 12 నియోజకవర్గాల తోపాటు 2 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆశక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.
అసెంబ్లీకి 2000 వేల రూపాయలు , పార్లమెంటకు 5000 వేల రూపాయలు దరఖాస్తు రుసుంగా పిసిసి నిర్ణయించిందన్నారు. 10వ తేదీ తరువాత ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. అన్ని నియోజక వర్గాలలోని మండల, జిల్లా నాయకులు పోటీచేసే అభ్యర్థుల తో కలిసి కట్టుగా ప్రచారం చేసి పార్టీ విజయానికి కృషిచేయాలని దేశంలో ప్రధాని నరేంద్ర మోది , రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ల అవినీతి, రాష్ట్రానికి చేసిన ద్రోహన్ని , ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి స్వార్ధరాజకీయ ప్రయోజనాలకోసం అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్షత నేతగా విఫలమయ్యాడని ప్రజందరికీ చెప్పాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందన్నారు. మొదటి రోజు 15 మంది ఆశావాదులు, వివిధ నియోజక వర్గాలకు దరఖాస్తుచేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శి యాదాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డి, వేమా శ్రీనివాసరావు, పి వెంకటేశ్వర్లు, వి రాజగోపాల్ రెడ్డి, నాగలక్ష్మీ, గుంటి ఆదినారాయణ, రసూల్, టి బుజ్జి , ఎల్లారెడ్డి, కమల్ ,గౌస్ తదితరులు పాల్గొన్నారు.