ప్రకాశం

వివి ప్యాడ్లపై అవగాహన కార్యక్రమాలు విసృత్తంగా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 18 : జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆవాస ప్రాంతాల్లో ప్రతి కమ్యూనిటీ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ ( వివి ప్యాడ్ ) లపై అవగాహానా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులతో ఆయన సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై , వివిధ అంశాలపై వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జెసి నాగలక్ష్మీ, జెసి -2 సిరి లతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జగన్ సమక్షంలో వైకాపా చేరిన
ఎమ్మెల్యే ముత్తుమల ముఖ్య అనుచరులు
*టీడీపీ నుండి వైకాపా లోకి అన్నా ఆధ్వర్యంలో భారీ చేరికలు
గిద్దలూరు, ఫిబ్రవరి 18 : గిద్దలూరు నియోజక వర్గ మాజీ శాసన సభ్యులు , వైకాపా సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు ఆద్వర్యంలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్‌రెడ్డి కి చెందిన టీడీపీ నాయకులు గిద్దలూరు అర్థవీడు ఎంపిపీలతో పాటు పలువురు మండల నాయకులు వైకాపా లో చేరారు. సోమవారం లోటస్ పాండ్ లోని వైకాపా అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి నివాసం లో జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైకాపా లో చేరారు. జగన్ మోహన్‌రెడ్డి నాయకులందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైకాపా లో చేరిన నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్నామని, వైయస్ జగన్ మోహన్‌రెడ్డి పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరడం జరిగిందన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి చూపిన బాటలోనే తనయుడు జగన్ మోహన్‌రెడ్డి పయనిస్తారని తెలిపారు. వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన వారిలో గిద్దలూరు, అర్థవీడు ఎంపిపి లు కె వంశీధర్‌రెడ్డి, నన్నబోయిన రవికుమార్ యాదవ్, అర్థవీడు జడ్పిటిసీ , కె వెంకటలక్ష్మీ, కెయస్ పల్లి ఎంపిటీసీ టి రామకృష్ణారెడ్డి, ముండ్లపాడు ఎంపిటిసీ పి రాజశేఖర్‌రెడ్డి , ఇడమకల్లు సొసైటీ అధ్యక్షులు వెదురు శ్రీనివాసరెడ్డి, కె క్రిష్ణారెడ్డి, పివి రంగారెడ్డి, పెద్ద కందుకూరు సర్పంచులు కోటేశ్వరరెడ్డి, హరనాధ్‌రెడ్డి, సిహెచ్ సుబ్బారెడ్డి, ఆర్ రమేష్‌రెడ్డి, యడవల్లి మాజీ సర్పంచ్ ఉడుముల సుధాకర్‌రెడ్డి, జిల్లా బీసీ నాయకులు కటారు రాజా అరుణ్‌కుమార్ యాదవ్, కాశిరెడ్డి, ప్రముఖ న్యాయవాది కె యువ శేఖర్‌రెడ్డి, డాక్టర్ భూమా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.22