ప్రకాశం

రౌడీ అన్న మాటే వినపడకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 18: రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు కృషిచేస్తానని జిల్లా నూతన ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో జిల్లా నూతన ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ముందుగా ఎన్నికలను ప్రాధాన్యతగా తీసుకుని ఎన్నికల సీజన్ అయిన ఈ మూడు నెలలపాటు జిల్లాలోని తమ పోలీసు యంత్రాంగం మొత్తం ఒక టీమ్‌గా ఏర్పడి ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేందుకు తమ శాయాశక్తులా కృషిచేయనున్నట్లు ఎస్‌పి తెలిపారు. జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కలెక్టర్ తాను సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా కండబలం, భుజబలం చూపించాలనుకుంటే వారు ఎంతటి వారైనా సహించబోనని ఎస్‌పి తెలిపారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనన్నారు. ఎన్నికల సమయంలో గాని, విడిగా కాని జిల్లాలో రౌడీ అనే మాట వినపడకూడదని ఎస్‌పి తెలిపారు. తాను 2014-16 సంవత్సరాల్లో విశాఖపట్నం ఎస్‌పిగా పనిచేశానని, తాను అక్కడ పనిచేసే కాలంలో ఆ ప్రాంతం అంతా ఎంతో సమస్యాత్మంగా ఉన్నప్పటికీ అవి అన్ని తట్టుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినట్లు ఎస్‌పి తెలిపారు. రాష్ట్ర విభజన నుండి ఓడరేవుల అభవృదిద్ కోసం తనను ఆంప్రదేశ్ పోర్టు డైరెక్టర్ ప్రభుత్వం కాకినాడ కు నియమించిందని, ఆ సమయంలో కూడా తాను బాగానే పనిచేశాన్న సంతృప్తి తనకు ఉందని ఎస్‌పి తెలిపారు. ఇప్పుడు తన దృష్టి అంతా రానున్న ఎన్నికలు సజావుగా నిర్వర్తించడం, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటమేని ఆయన తెలిపారు.

అభివృద్ధి చేశాను ఆశీర్వదించండి
- మంత్రి శిద్ధా రాఘవరావు
తాళ్లూరు, పిభ్రవరి 18: దర్శి నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగనిరీతితో అభివృద్ధి చేసారని తిరిగి మళ్లీ ఆశీర్వదించాలని రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మల్కాపురం గ్రామంలో సోమవారం వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం రెవెన్యూలోటులో ఉన్నా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కష్టపడి అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. అర్హలైన అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. గత ఐదేళ్ల క్రితం ఉన్న పరిస్థితి నేటి పరిస్థితిని గ్రామాల్లో గమనించాలన్నారు. వౌలిక వసతులు అభివృద్ధికి తాను చేసిన కృషిని గుర్తించాలని కోరారు. ముందుగా ఎన్‌టీఆర్ సుజలం వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
గుంటి గంగ భవానికి ప్రత్యేక పూజలు ...
జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని మంత్రి సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు శాగం కొండారెడ్డి, మాజీ అధ్యక్షుడు బడే, జిల్లా సమన్యయకర్త మానం రమేష్, చందన, సాగర్ తదితరులు పాల్గొన్నారు