ప్రకాశం

రామాలయంలో గరుడ వాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, ఫిబ్రవరి 20: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం పొదిలి ఓబుల్‌శెట్టి వీధిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో గరుడవాహన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరంగా, కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన తీగల మస్తాన్‌రావు, సుభాషిణి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాలయం వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, ఆవులూరి యలమంద, మాకినేని నారాయణరావు, వైకాపా నాయకులు జీ.చెన్నారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పాలేటి అరెస్టుతో చీరాలలో ఉద్రిక్తత
చీరాల,్ఫబ్రవరి 20: వేటపాలెంలోని కొణిజేటి చేనేతపురి వద్దజరిగిన పరిణామాలకు కొనసాగింపుగా బుధవారం తెలుగుదేశం పార్టీనాయకులు,మాజీమంత్రి పాలేటి రామారావు, సజ్జావేంకటేశ్వరరావు, తలారి శ్రీను, గవినిరాధాకృష్ణ, గవినిశ్రీను, బోయిన కేశవులులను స్ధానిక 2వపట్టణ పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగాపాలేటి మాట్లాడుతూ బాధితుల పక్షాననిలిస్తే పోలీసుకేసులు తప్పవని పోలీసువ్యవస్ధనిరూపించిందన్నారు. గతంలోజరిగిన అనేక సంఘటనల్లోపోలీసులు ఎటువంటిచర్యలుతీసుకోలేదని,న్యాయంకోసం వెడితే కేసులు తప్పవని రాష్ట్రప్రభుత్వం, పోలీసులునిరూపించారన్నారు.బాధితుల పక్షానపోరాడేవారికి కేసులు బహుమానంగా ఇచ్చారని తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. పాలేటిని అరెస్టుచేసిన విషయం తెలుసుకొన్న తెలుగుదేశం పార్టీఅభిమానులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో స్టేషన్‌వద్దకుచేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. 2వపట్టణ ఇన్స్‌పెక్టర్ బేతపూడి ప్రసాద్ మాట్లాడుతూ వారిని కోర్టుకు తీసుకొనివెళుతున్నట్లు చెప్పారు. పోలీసుస్టేషన్‌లో డాక్టర్ పాలేటిని ఎమ్మెల్సీ పోతుల సునీత, యడం బాలాజీ పరామర్శించారు. కోర్టు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారు.