ప్రకాశం

ఆర్యవైశులకు టీడీపీ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని ఆర్యవైశులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. బుధవారం స్థానిక ప్రైవేట్ హోటల్‌లో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శిద్దా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశుల సంక్షేమం కోసం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలోని పేద ఆర్యవైశ్యులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం 50కోట్లరూపాయల మూలధనంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులను రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. విజయవాడలో 12.50కోట్ల రూపాయలతో వాసవీ సత్రం కొనుగోలుకు 90లక్షల రూపాయల స్టాంపుడ్యూటీని ప్రభుత్వం 60లక్షల రూపాయలకు రాయితీ ఇచ్చిందని, ఇది ఆర్యవైశ్యలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రాబోయే రోజుల్లో 50కోట్లనుంచి రెండువందల కోట్లరూపాయల వరకు నిధులు కెటాయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్యవైశ్యులకు తాము అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఆర్యవైశ్యులు అందరూ ఐక్యమత్యంతో కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అందరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు శిద్దా సూర్యప్రకాష్ జిల్లాలో ఆర్యవైశ్యసంఘం భవనం నిర్మాణానికి 50లక్షల రూపాయల విరాళం ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు, నాయకులు శిద్దా నాగేశ్వరరావు, దేవకి వెంకటేశ్వర్లు, పల్లపోతు వెంకటేశ్వర్లు, కే.హరిప్రసాదు, ఎం.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.