ప్రకాశం

ముఖ్యమంత్రితో భేటీ నేటికి వాయిథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 12: జిల్లా రాజకీయాలు మొత్తం రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని రోజుల నుండి వీరి రాజకీయ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు కాంగ్రెస్‌ని వీడి టీడీపీ గూటికి చేరటం, మరోపక్క ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరనున్న నేపథ్యంలో జిల్లా టీడీపీలో రాజకీయ సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనిగిరి, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి సారించారు. అందులో భాగంగా మంగళవారం తనను కలవాలని ఈ ముగ్గురికి రాష్టప్రార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో మంత్రి శిద్దా, కదిరి, ఉగ్రలు అమరావతికి బయలుదేరారు. మొదట ఈ ముగ్గురు మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరితో మంతనాలు సాగించినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రితో ఈ ముగ్గురు వేర్వేరుగా భేటీ కావలసి ఉండగా అనివార్యకారణాలతో వారి కలయిక బుధవారానికి వాయిదా పడినట్లు పార్టీవర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మంత్రి శిద్దా రాఘవరావు, కనిగిరి నుంచి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దర్శి నుంచి కదిరి బాబురావు పేర్లు దాదాదు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. దర్శి నుంచి మంత్రి శిద్దానే మళ్లీ పోటీచేయించాలని నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేసినా అధిష్టానం మాత్రం వారి మాటలను ఆలకించే పరిస్థితిలో లేనట్లుగా తెలుస్తోంది. కాగా సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపైన కూడా చర్చ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌ను ఖరారు చేయాలనుని చంద్రబాబు బావిస్తుండగా అసమ్మతివర్గం మాత్రం ససేమిరా అంటోంది. అసమ్మతి నేతలు ముఖ్యమంత్రికే ఘాటుగా సమాధానం చెప్పే పరిస్థితి ఉండటంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. కాగా యర్రగొండపాలెం నియోజకవర్గానికి పోటీచేసే అభ్యర్థిని కూడా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అనే మీమాంసలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జిల్లాలోని 12 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను రాష్టప్రార్టీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఇంతవరకు ప్రధాన రాజకీయపక్షాలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేయకపోవటంపై ఆయా పార్టీల్లోని శ్రేణుల్లో చర్చ సాగుతోంది.