ప్రకాశం

నోడల్ అధికారులు ఎన్నికల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 12: జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. మంగళవారం సీపీవో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావారీగా విధులు నిర్వహించేందుకు కమిటీల వారీగా నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా పనిచేయాలని కోరారు. నోడల్ అధికారులు, జిల్లా పోలీసు నోడల్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎప్పటికపుడు రోజువారీ సమాచార లోపం లేకుండా చూసుకోవాలన్నారు. ఈవీఎంలు పోలింగ్ స్టేషన్లకు తరలింపులో ఇబ్బందులు లేకుండా, పూర్తి సెక్యూరిటీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లల్లో ఈవీఎంలు ఏ విధంగా ఉపయోగించాలో శిక్షణలో తెలుసుకోవాలన్నారు. జిల్లావారీగా పోలింగ్ స్టేషన్లకు పంపించే మెటీరియల్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్ల అనుమానాలను నివృత్తి చేసేందుకు, ఎన్నికలకు సంబంధించిన అంశాలు తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ప్రజలు ఎవరైనా ఫిర్యాదులు చేయదలచుకుంటే అందుబాటులోని హెల్ప్‌లైన్ ఫోన్‌కు తెలపాలన్నారు.
జిల్లా నోడల్ అధికారులకు సీ-విజిల్ ద్వారా ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. 12 నియోజకవర్గాల వారీగా అబ్జర్వర్లు, పోలింగ్ డ్యూటీలో పాల్గొనే సిబ్బందికి వాహనాల కొరత లేకుండా ముందుగా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. నోడల్ అధికారులు తగిన కార్యాచరణ ప్రణాళికతో ఆర్వోలతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్‌బ్యాలెట్ దరఖాస్తును ముందుగా గుర్తించి వారికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్-2 సిరి, డీఆర్వో వెంకటసుబ్బయ్య, ఎస్‌డీసీ చంద్రవౌళి, సీపీవో వై.వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.