ప్రకాశం

రెండురోజుల్లో వైసీపీలోకి మాగుంట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 12: ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రెండురోజుల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ మేరకు మాగుంట సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. మరోపక్క వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేస్తే మీరే గెలుస్తారు, వైసీపీలోకి వెళ్లటం ఎందుకంటూ ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు మాగుంటపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కానీ మాగుంట, ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు వైసీపీ గూటికి చేరాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవంగా నేడే మాగుంట వైసీపీ అధినేత జగన్‌ను కలవాలని నిర్ణయంచుకున్నారు. అయతే నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి రావడంతో వాయదా వేసుకున్నారు. వైసీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని పోటీకి నిలిపితే యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండెపి, ఒంగోలు నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధిస్తుందని జగన్‌కు నివేదిక అందినట్లు తెలుస్తొంది. అందుకే సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మాగుంటను పార్టీలోకి చేర్చుకుంటున్నారని సమాచారం. ప్రధానంగా రాష్టప్రార్టీ ఒంగోలు, కొండెపి నియోజకవర్గాల్లో వైసీపీ పాగావేయాలనే ధృడ సంకల్పంతో ఉన్నట్లు సమాచారం. మాగుంట అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోను ఆయన ప్రభావంతో విజయం సాధించవచ్చని సర్వే నివేదికల ఆధారంగా అందిన సమాచారంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కేవలం రాష్టప్రార్టీ వ్యవహారాలకే వైవీ పరిమితమై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 15వతేదీనుండి జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో బస్‌యాత్రలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బస్‌యాత్రకు బయలుదేరే ముందే రాష్టవ్య్రాప్తంగా అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారా, లేక యాత్రల సందర్భంగా అభ్యర్ధులను ప్రకటిస్తారా అనే చర్చ సాగుతోంది. ప్రధాన నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్ధులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే రాష్టప్రార్టీ అధికారికంగా ప్రకటిస్తేనే వారంతా అభ్యర్థులుగా చలామణి కానున్నారు.