ప్రార్థన

ఉపకారములను మరువకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా ప్రాణమా! యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము’ - కీర్తన 103:2
చిన్నప్పుడు అమ్మ చేసిన వంటల రుచి ఇంకా గుర్తు ఉంది. నాన్న తీసుకొచ్చే మిఠాయి పొట్లం ఇప్పుడు గుర్తు ఉంటుంది. ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన పనులు అన్నీ గుర్తున్నాయి. మన బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మొట్టమొదట కలిసిన రోజు తారీఖు నెల సంవత్సరంతోపాటు జ్ఞాపకముంటాయి. ఇంక వాళ్లు వేసుకున్న బట్టలు, మొదటి మాటలు అన్నీ గుర్తుంటాయి. చాలా ఏళ్ల తరువాత పాత స్నేహితులు కలిసి మాట్లాడుతూ, నీకొక గర్ల్‌ఫ్రెండ్ ఉండాలి గదా. రోజూ చాక్లెట్స్ ఇచ్చేవాడివి. ఎలా ఉంది ఆ అమ్మాయి? అని అడిగాడు. వాళ్ల కొడుకు మాతోనే కార్లో ఉన్నాడు. కొడుకు ముందు చెప్పటానికి ఇతను నసుగుతుంటే తెలియదన్నట్టు దాటవేస్తుంటే, ఆ రోజు ఎక్కడున్నదీ? ఎలా ఉన్నది? ఏమేం చేసినదీ అన్నీ స్పష్టంగా వివరించి చెప్తుంటే - ఆయన కొడుకేమో నవ్వుకుంటున్నాడు. మాకేమో నీతులు చెప్తాడు. ఈయన సంగతి ఇదా? అని. ఇలా మనకు ఇష్టమైన విషయాలు ఇంకా ఎన్నో కళ్ల ముందు జరిగినట్టు గుర్తున్నప్పుడు ప్రభువు చేసిన ఉపకారములు ఎంత గుర్తుండాలి? అసలు మరపు రాకూడదు గదా! అమ్మ వాళ్లు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు - చిన్నప్పుడు బహు భయంకర పరిస్థితులుండేవి. దేవుని కృపను బట్టి వాటన్నింటి నుండి తప్పించుకోగలిగాము. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు. మరణాపాయాల నుండి ఎలా తప్పించాడో, కష్టాల నుండి, పేదరికం నుండి, బాధల నుండి, వాటి వలన ఇంట్లో జరిగే యుద్ధాలలాంటి గొడవల నుండి తప్పించి ఈ స్థితికి ఎలా రాగలిగామో అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుతుంటారు. నా పరిస్థితి కూడా చిన్నప్పుడు టైఫాయిడ్ వల్ల చనిపోతాననుకున్నారంతా. ఆ సమయంలో గుంటూరు కుగ్లర్ హాస్పిటల్‌లో చేర్చి, ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ దేవుని బ్రతిమాలి, ఆరోగ్యమిస్తే నీ సేవకు ఇస్తామని మా అమ్మమ్మ వాళ్లు చెప్పిచెప్పి గుర్తుచేసినా వయసులో పట్టించుకోలేదు గానీ ఇప్పుడు మాత్రము మరణకరమైన రోగం నుండి తప్పించిన ప్రభువు కార్యాన్ని జ్ఞాపకముంచుకొని, ఆయన కొరకే జీవిస్తున్నాను. ఆ మేలులు మరువలేనివి. ఆ కష్టాలు ఆ బాధలు మరువలేనివి. మండుటెండల్లో నీటి కొరకు మైళ్లు మైళ్లు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఉన్న రోజుల నుండి, ప్రతి గదిలో నీళ్లు ఉండేలా చేసిన ప్రభువు కార్యాలు ఎలా మరువగలము.
‘దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము’ - ద్వితీ 6:12. ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు దారిద్య్రాల నుండి బానిసత్వము నుండి తప్పించిన రక్షకుడైన యేసును ఎలా మరువగలము? కానీ మరుపు వస్తుంది అనేకసార్లు. మన పూర్వపు దీన స్థితి మర్చిపోతున్నాం. దేవుడు ఏ స్థితి నుండి ఈ స్థితికి తెచ్చాడోనన్న సంగతిని పూర్తిగా మరచిపోయి, ఇంకా ఏదో కావాలి? ఏదో పొందుకోవాలి అన్న ఆరాటముతో, దురాశలతో తృప్తిలేని జీవితం గడుపుతూ, దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. దేవుని మేలులు మరచిపోతున్నారు. దేవుడిచ్చిన దానితో తృప్తిగా ఉంటే ఎంత మేలు అన్న సంగతి మరచిపోయి పరులతో పోటీ పడి, నిరాశతో బ్రతుకుతూ దేవుని స్తుతించలేక పోతున్నారు. ఎదుటివారితో పోటీలు ఎక్కువయ్యాయి. పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ఇస్తే, పోటీలో ఈర్ష్యాద్వేషాలు అసూయలతో జీవితం నడుస్తుంది. మనము కన్నులారా చూచిన వాటిని మరువక జీవిత కాలమంతయు హృదయములో నుండి తొలగిపోకుండునట్లు మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిని పిల్లలకు నేర్పించాలి. దేవుడిచ్చిన తల్లిదండ్రులు నచ్చటం లేదు. గొప్పవారైతే బాగుండు అనుకుంటున్నారు. దేవుడిచ్చిన భాగస్వాములు నచ్చటం లేదు. పొరుగు వారి భార్య, పొరుగు వారి భర్త, పొరుగు వారి ఇల్లే బాగున్నట్లు ఉన్నారు గనుక, ఎవరికి కలిగిన వాటితో వారు తృప్తి పడలేక పోతున్నారు. సంతోషం లేదు. పుట్టిన స్థలం ఇష్టం లేదు. ఏదో ఒక అడ్వాన్స్‌డ్ కంట్రీలో పుడితే బాగుండేది అనుకుంటున్నారు. వారికిచ్చిన తలాంతులు వారికి నచ్చటం లేదు. దేవుడు ప్రతివారికి వారివారి పరిస్థితులకు అనుగుణంగా ఇస్తే, ఎవరి కిచ్చిన రంగు, ఎత్తు, హెయిర్‌స్టైల్స్, వారికి నచ్చక అన్నీ మార్చాలని చూస్తున్నారు. దేవుడు అనాదికాల సంకల్పములో సమస్తము ఆలోచించి, ఎవరు ఎక్కడ పుట్టాలి? వారి ఎత్తు ఎంత ఉండాలి? ఏ రంగుతో ఉండాలి? ఏ కుటుంబంలో పుట్టాలి? ఏ దేశంలో పుట్టాలి? అని నిర్ణయిస్తే, దేవుడు చేసినవి నచ్చకపోవటం వల్ల ఆయనకు స్తుతులు చెల్లించలేక పోతున్నారు. సన్నుతించ లేకపోతున్నారు. అలాగని మనకు గౌరవించటం రాదని కాదు. విలువలేని వారిని, ఏ మేలూ చేయని వారిని చాలా పొగడుతాము. గౌరవిస్తాం. కానీ మనకు ప్రాణమే ఇచ్చిన ప్రభువు చేసిన మేలులు మాత్రము మర్చిపోతున్నాము.
అయితే దావీదు మహారాజు దేవుడు చేసిన మేలులు మరువకూడదని తన ప్రాణముతోనే చెప్పుకుంటున్నాడు. ప్రాణప్రియుడుగా పూజిస్తూ, ప్రాణముతోనే చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా! యెహోవాను సన్నుతించుమని. అంతేకాదు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదని చెప్పుకుంటూ, మనకు కూడా ఈ మాదిరి మార్గమును చూయిస్తున్నాడు.
దేవుని స్తుతించుట ఘనపరచుట ఎంతో మంచిది. ఆయన దయాళత్వమును బట్టి స్తుతించాలి. ఆయన కృప నిత్యముంటుంది. గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గుండె చెదరిన వారిని బాగుచేయువాడు. ఆయన గొప్పవాడు. శక్తిసంపన్నుడు. దీనులను పైకి లేపువాడు. గనుక ఆయనను ఘనపరచాలి. అయితే ప్రభువు మానవుల వలె పొగడ్తలు కోరుకునేవాడు కాదు. ఆయన ఏమిటో ఎంత మేలు చేశాడో ఎంత మేలు చేయువాడో అని తెలిసి స్తుతించాలి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును.
ప్రభువు మన దోషములన్నింటిని క్షమించువాడు. ప్రభువు యొద్ద మనకు క్షమాపణ దొరకును. ఎంత పాపమైనా ఎటువంటి పాపికైనా సిలువలో ఆయన కార్చిన రక్తమును బట్టి మనకు విమోచన ఉంటుంది. అయితే విశ్వాసముతో అడగాలి. మొరపెట్టాలి. తప్పక క్షమిస్తాడు. ఎవరినీ త్రోసివేయడు. ఆయన శరణుజొచ్చిన వారెవరైనా ఏ కులస్థుడైనా ఏ దేశస్థుడైనా ధనికుడైనా పేదయైనా ఆయన యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరినీ ఆయన చేర్చుకుంటాడు. దోషము లేనివాడు ఈ భూమి మీద ఎవడూ లేడు. పాపాలు చేయని వారు ఎవరూ లేరు. మనము పాపాలు చేసినందువల్ల పాపులము కాము గానీ పాపులము గనుక పాపాలు చేస్తున్నాము. పాపానికి బానిసలౌతున్నాము. తప్పు చేయకూడదని తెలుసు గానీ తప్పు చేస్తాము. వాటినన్నిటిని క్షమిస్తాడు. తిరిగి పాపములో జారిపడకుండా ఉండటానికి శక్తినిస్తాడు. ఇంకొక సంగతి - ప్రభువు మనలను క్షమించినంత త్వరగా మనము కూడా ఇతరులను క్షమించాలి. కానీ ఎందుకో దేవుడు కోరుకున్నంత రీతిలో క్షమించలేక పోతున్నాము. ఇదీ పాపమే. అయితే ఈ తప్పును కూడా ప్రభువు క్షమిస్తాడు. నీ సంకటములన్నింటిని కుదుర్చువాడు - ఏ విధమైన రోగాలైనా దీర్ఘకాలికమైనా కూడా క్షమించి బాగు చేయగలడు. శారీరక ఆత్మీయ మానసికమైన బాధలను రోగాలను కూడా కుదర్చగల సమర్థుడు.
పాప క్షమాపణ లేకుండా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, స్వస్థత ఉన్నా, ఎంత ఐశ్వర్యమున్నా ఉపయోగము లేదు. ఈ లోక ఆనందము ఎంత ఉన్నా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా ఉపయోగము లేదు. కారణము పాప క్షమాపణ లేకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేము. యేసు ప్రభువు కార్చిన రక్తముతో మాత్రమే మనకు ఈ క్షమాపణ దొరుకుతుంది. కనుక మన దోషములను కడిగిన ప్రభువును ఘనపరచాలి. మనలను పాప రహితులను చేసిన ప్రభువును స్తుతించాలి. అనుదినము ఆయన రక్షణను ప్రచురపరచాలి. ఆయనకు తగిన మహిమ చెల్లించాలి.
సమాధిలో నుండి ప్రాణమును విమోచించగలిగిన ప్రభువుకు తగిన మహిమ చెల్లించాలి. పాతాళ బలములో నుండి ప్రాణమును విమోచించగలడు. వాస్తవానికి మరణ బంధకములు మనలను చుట్టుకొని యున్నవి. పాతాళ వేదనలు పట్టుకొని యున్నవి. కారణము మన పాపము. అయితే ప్రభువు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక ఆయన ఏకైక కుమారుని మన కొరకు పంపి ఆయన చిందించిన రక్తములో మన పాపములను క్షమించాడు. కనుకనే మరణ పాపములు గానీ పాతాళ వేదనలు గానీ మనలను ఏమీ చేయలేవు గనుక ప్రభువును సన్నుతించాలి. అలా మనకు క్షేమమును విస్తరింపజేసిన ప్రభువు మేలుకు కృతజ్ఞత చెల్లించాలి. ఆయన మనకు ముందు కాపరి, వెనుక భాగమేమో ఆయన కృపా క్షేమములు ఉంటున్నవి. ఇలా మనలను కాపాడుతూ భద్రపరుస్తూ ప్రాణములను సేదదీర్చుతున్న ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుట మరువకూడదు. అసలు ఆయన చేసిన మేలులన్నింటిని బట్టి మనమాయనకేమి చెల్లించగలము.
రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయనను కీర్తించటము తప్ప. అది కూడా ఈ ప్రజలందరి మధ్య. ఎల్లకాలము ఉండే ఆయన కృపా కనికరాలను బట్టి స్తుతించాలి. సంగీత నాదములతో మ్రోగు తాళములతో గంభీర తాళములతో పూర్ణ హృదయముతో కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అది ఎంతో మంచిది. కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచిన ప్రభువు ఉపకారమును మరువకూడదు. మహిమ ప్రభావములతో మనకు కిరీటము ధరింపచేసే దేవుని ఎలా మరువగలము. అసలు మనమేపాటి వారము. కేవలము దుమ్ము ధూళియైన మనలను ఆయన జ్ఞాపకము చేసుకున్నందుకు ఆయనను మరువకూడదు. అందరూ మనలను మరచినా విడిచినా ప్రభువు మనలను మరువడు విడువడు. అసలు మరణ భయము నుండి మనలను తప్పించిన ప్రభువు మేలును మరచిపోకూడదు. మరణము యొక్క బలము గలవానిని, మరణము ద్వారా నశింపచేసిన యేసుక్రీస్తు తప్ప మనలను విడిపింపగల వారెవరు?
పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో మన హృదయాలను తృప్తిపరచే దేవుడు.
తృప్తి: ఘూళ త్యీజూ! నిఆ జశఒ జరీళ ఘ ఒజ్పళూ ఇళ. దళ జష్దళఒఆ ఘౄశ ఘౄక శ్యఆ ఛ్యిఖశజూ జఆ. దళ ళ్ఘఆళఒఆ ష్యశజిఖళ్యూ ద్ఘఒ శళ్పళూ త్యీశ జఆ. దళ ఔ్యఖజూళఒఆ ఉౄఔళ్యూ ష్ఘశ శ్యఆ ష్య్ఘౄౄశజూ జఆ. ఢ్ఘఆజఒచ్ఘిషఆజ్యశ జఒ డఔజూజఆఖ్ఘ ఇళఒఒజశ. నిఆ జఒ ఘ జూజ్పజశళ ఘూషళ ఆ్ద్ఘఆ ష్యౄళఒ ఛ్యిౄ ఆ్దళ ళ్ఘఆ ఒ్ఘఆజఒఛికజశ ధ్యిజూ. దళ ద్యిజూ త్ద్యీ జఒ, దజౄఒళచి, ఘ ఒఖచిచిజషజళశఆ, జఒ ఆ్దళ యశక యశళ త్ద్యీ ష్ఘశ ఇళ ఒఖచిచిజషజళశఆ ఆ్య చిజ ఆ్దళ దళ్ఘూఆ యచి ఘౄశ. డ్ఘఆజఒచ్ఘిషఆజ్యశ! జ్దీక, ఆ్ద్ఘఆ ౄళ్ఘశఒ ళశ్యఖద, ఘశజూ ళశ్యఖద జఒ ఘ ఛిళ్ఘఒఆ.
మేలుతో హృదయాన్ని తృప్తిపరచే దేవుడు. లోకములో ఎంతో మందికి ఎన్నో మేలులు జరుగుచున్నవి. అనుకున్ననన్ని సాధించగలుగుచున్నారు. చివరకు చంద్ర మండలము మీదకు కూడా వెళ్లగలుగుచున్నారు. ఇంకా ఏవేవో సాధిస్తున్నారు. సంపాదిస్తున్నారు. మంచి ఉద్యోగాలు, మంచి ఇళ్లు, మంచి మంచి కార్లు, మంచి కుటుంబాలు అన్నీ ఉన్నా ‘తృప్తి’ లేక ఇంకా ఏవేవో చేస్తున్నారు. దేవుడిచ్చిన అమూల్యమైన ఆయుష్షును ఆయాసపరచుకుంటూ అసంతృప్తిగా ఉంటున్నారు. అయితే ప్రభువు మనకు మేలు చేసి తృప్తిపరుస్తాడు. జీవితములో తృప్తి చాలా ముఖ్యం. ఇది కొనగలిగేది కాదు. దేవుడు మన హృదయాలకు ఇచ్చే గొప్ప వరము. గొప్ప మేలు. తృప్తి అనేది ఒక రోజు ఒక పూట కొరకు కాదు. ప్రభువిచ్చే తృప్తి మన జీవితాంతము ఉంటూనే ఉంటుంది. తృప్తిలేని జీవితాలు అనేక రకాలైన చెడు అలవాట్లకు బానిసలౌతున్నాయి. తద్వారా ఉన్న ఆరోగ్యాలు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. చివరకు ప్రాణాలు అర్థంతరంగా పోగొట్టుకుంటున్నారు.
తృప్తిగల జీవితములో సమాధానము, సంతోషము, ఆనందముంటుంది. సంతోషమే సగము బలమనే సామెతలాగ సంతోషము మనకు బలము శక్తినిస్తుంది. దేవుని వెంబడించే వారు పనుల భారము వల్ల, శోధనల వల్ల కష్టాల వల్ల అలసిపోవచ్చు. అలుపు వచ్చినప్పుడు బలముండదు. శక్తి ఉండదు. ఇక చేసినది చాలు అన్నట్టుగా బలహీనపడతారు. మొదట ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. సాతానుడు పెట్టే ఇబ్బందులకు అలుపు వస్తుంది. అటువంటి సమయాలలో దేవుడిచ్చే తృప్తి మనలను బలపరుస్తుంది. లోకము బలహీనపరచే సమయములో దేవుడిచ్చే తృప్తికరమైన మేలులు హృదయాన్ని తెప్పరిల్లచేసి నూతన శక్తిని బలాన్ని కలుగజేస్తాయి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము నూతనపరచబడుతుంది. మరల దేవునితో నడవటానికి శక్తి వస్తుంది. వారు నీతి కలిగి ఖర్జూరము వలె మువ్వవేయుదురు. లేబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడినవారై దేవుని ఆవరణములో వర్థిల్లుతారు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యధార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉందురు. కనుక ప్రభువు చేసిన మేలులు దేనిని మరువకుండా, దేవుని సన్నుతిస్తూ, ఆయన ఇచ్చే తృప్తికరమైన జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక.

- మద్దు పీటర్ 9490651256