ప్రకాశం

కేసులు బనాయించారనే మనస్థాపంతో హోంగార్డు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, జూలై 1: తమ్ముడిపై, తనపై కేసులు బనాయించారని మనస్థాపం చెందిన హోంగార్డు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఐనముక్కుల గ్రామ పొలాల్లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కడపరాజుపల్లి గ్రామానికి చెందిన గోన మల్లికార్జున (34) హోంగార్డుగా పెద్దదోర్నాల పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్నాడు. తమ్ముడు నగేష్ గతంలో పెద్దనాన్న మనుమరాలిని పెళ్ళిచేసుకొని కొంతకాలం తరువాత వదిలివేశాడు. తదనంతరం కడపరాజుపల్లి గ్రామానికి చెందిన బత్తుల నాగమ్మ, సుంకయ్యల కుమార్తె రమణను నగేష్ పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలం తరువాత ఆ అమ్మాయినీ వదిలివేశాడు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెద్దదోర్నాల పోలీసుస్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో తన తమ్ముడిపై ఫిర్యాదు చేస్తారా అంటూ హోంగార్డు మల్లికార్జున వారిని మందలించాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు హోంగార్డు మల్లికార్జునపై, తమ్ముడు నగేష్‌పై కేసులు పెట్టారు. దీంతో మనస్థాపానికి గురైన హోంగార్డు మల్లికార్జున గత పదిరోజులుగా డ్యూటీకి వెళ్ళడం లేదు. ఈ విషయంపై ఇటీవల మార్కాపురం డివైఎస్పీ ఆర్ శ్రీహరిబాబు కడపరాజుపల్లి గ్రామానికి వెళ్ళి విచారించారు. అయితే కేసుల వలన తన ఉద్యోగానికి ముప్పు వస్తుందేమోనని హోంగార్డు మల్లికార్జున శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.