ప్రకాశం

మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, జూలై 14 : సమాజం సిగ్గుతో తల వంచుకునేలా మతిస్థితిమితం లేని మానసిక వికలాంగురాలిపై మగమృగాలు చేసిన అత్యాచారానికి అభంశుభం తెలియని అనాథ మహిళ గర్భందాల్చింది. ప్రస్తుతం ఎనిమిది నెలల శిశువును గర్భంలో మోస్తున్న ఈ మహిళపై నాటి నుంచి నేటి వరకు కామంతో కళ్లు మూసుకుపోయిన మగమృగాలు నిత్యం అత్యాచారం చేస్తూనే వస్తున్నారు. అయితే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నది ఎవరో గుర్తించడం ఆలస్యమైనప్పటికీ అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దృష్టి సారించారు. దీంతో మతిస్థిమితం లేని మహిళపై కామవాంఛ తీర్చుకుంటున్నది ఎవరో వెలుగులోకి వచ్చింది. దీనితో సదరు మగమృగాలపై తాడివారిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ చిన్నకాశీంబీకి మండలంలోని గానుగపెంట గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే చిన్నకాశీంబీ మానసిక పరిస్థితి బాగ లేకపోవడంతో భర్త ఆమెను వదిలివేశాడు. ఈ నేపథ్యంలో చిన్నకాశీంబీ తుమ్మలచెరువులో ఉన్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇలా కొంతకాలం గడచిన అనంతరం తల్లిదండ్రులు చనిపోయారు. దీనితో చిన్నకాశీంబీ అనాథగా మిగిలింది. గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు మగమృగాలు యుక్తవయస్సులో ఉన్న కాశీంబీపై కనే్నశారు. మతిస్థిమితం లేని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పదేపదే సంబంధిత మృగాలు అవకాశం వచ్చినప్పుడల్లా కాశీంబీపై అత్యాచారం చేస్తుండటంతో కాశీంబీ గర్భందాల్చింది. గర్భానికి కారకులు ఎవరో గ్రామప్రజలకు తెలియకపోవడంతో అమాయకురాలు గర్భం దాల్చిందంటూ గ్రామస్థులు ఆమెపై జాలిచూపి సమయానికి ఆహారం పెడుతూ సపర్యలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ మగమృగాలు ఎనిమిది నెలల గర్భంతో ఉన్న కాశీంబీపై దయచూపకుండా నిత్యం అదేపనికి పాల్పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఓ అజ్ఞాత వ్యక్తి జిల్లాఎస్పీకి ఇచ్చిన సమాచారం మేరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే సమయంలో బుధవారం పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసేందుకు జిల్లాఎస్పీ త్రివిక్రమవర్మ వచ్చినప్పటికీ సంబంధిత సమాచారం అందించ లేదని స్థానిక ఎస్సైపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ కేసును విచారణ చేయాలని పొదిలి సిఐని ఆదేశించినట్లు తెలిసింది. దీనితో గురువారం రంగంలోకి దిగి విచారణ జరిపి ఈ సంఘటనకు బాధ్యులైన సయ్యద్ మహబూబ్‌బాషా, సయ్యద్ యూసఫ్, షేక్ పెద్దమాబు, షేక్ షెబ్బీర్, తుంబేటి సంజీవ్‌లపై 417, 420, 376 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రభూమి బ్యూరో