ప్రకాశం

కృష్ణా పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 5: కృష్ణాపుష్కరాల సందర్భంగా జిల్లాల నుండి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో పోలీసు, ఆర్‌అండ్‌బి, నేషనల్ హైవే, నాన్‌హైవే అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అధికారులు గుర్తించి సూచించిన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రమేష్‌ను ఆదేశించారు. ప్రమాదకర మలుపుల వద్ద వ్యవస్ధను బలోపేతం చేస్తూ ప్రమాద హెచ్చరికల గుర్తులు, రేడియం స్టిక్కర్లు అంటించే ఏర్పాట్లు చేయాలన్నారు. గుండ్లకమ్మ, మద్దిరాలపాడు కాజ్‌వేల వద్ద తాత్కాలికంగా పోల్స్ ఏర్పాటుచేసి వాహనదారులకు కనిపించేవిధంగా పెయిటింగ్ చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్రోవగుంట, చీరాల రోడ్‌మార్జిన్స్ సక్రమంగా లేవని, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలన్నారు. ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు, మద్దిరాలపాడు, ఈపురుపాలెంలోని తాత్కాలిక ఆక్రమణలు రెవిన్యూ యంత్రాంగం ద్వారా తొలగించే ఏర్పాటుచేయాలని జిల్లా జాయింట్‌కలెక్టర్‌ను ఆదేశించారు. మార్కాపురం, చీరాల డిఎస్‌పిలు పది చొప్పున కుంభాకర అద్దాలు తీవ్ర మలుపుల వద్ద అవసరం ఉందని జిల్లాకలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడ అవసరమో అక్కడ వాటిని ఏర్పాటుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దోర్నాల, శిఖరం,రోళ్ళపెంట -దోర్నాల ప్రమాదభరిత ప్రాంతాలుగా గుర్తించటం జరిగిందని, ఆయాప్రాంతాల్లో మలుపుల వద్ద భద్రత నిమిత్తం గోడలను నిర్మించి పెయిటింగ్ వేయించాలని, సంకేత గుర్తులు ఉంచాలన్నారు. భారీ వాహనాలు మరమ్మత్తులకు గురైనప్పుడు మరమ్మత్తులు చేపట్టేందుకు అవసరమైన మెకానిక్‌లు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ భారీ క్రేన్స్, అంబులెన్స్ ఆయాప్రాంతాల్లో సిద్దంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో రోడ్ల వెంట ఉన్న పిహెచ్‌సిల వద్ద అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మొబైల్ డాక్టర్స్ బృందాన్ని ఏర్పాటుచేయాలన్నారు. కోర్రప్రొలు, చింతల, దోర్నాల వద్ద మెడికల్ టీంలు సిద్ధంగా ఉంచామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యాస్మిన్ కలెక్టర్‌కు తెలిపారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌తోపాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.