ప్రకాశం

గొట్టిపాటి భరత్‌కు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, ఆగస్టు 17: పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి గొట్టిపాటి భరత్‌కు బెయిల్ మంజూరైనట్లు ఆ పార్టీ మండల ఇన్‌ఛార్జి కాకోలు రామారావు తెలిపారు. మూడు రోజుల క్రితం జాతీయ రహదారిపై ధర్నా చేసినందుకు గాను ప్రజలకు ఇబ్బంది కలిగించారనే అభియోగంతో అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విధితమే. ఆ కేసులో బుధవారం అద్దంకి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 వాహనాల్లో కార్యకర్తలతో తరలివెళ్లి గొట్టిపాటి భరత్‌ను ఊరేగింపుగా తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ పఠాన్ కాలేషావలి, సులేమాన్, కనె్నగంటి శ్రీనివాసరావు, అట్టూరి సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతి
కందుకూరు, ఆగస్టు 17: పట్టణంలోని ఓవి రోడ్డులో మాల్యాద్రికాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశీంసాహెబ్ (62) అనే వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నందనవనంకు చెందిన కాశీంసాహెబ్ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన కాశీంను స్థానికులు 108 ద్వారా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్ బస్సు ఢీకొని ఒకని మృతి
వలేటివారిపాలెం, ఆగస్టు 17: ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పోకూరు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అత్తంటివారిపాలెం గ్రామానికి చెందిన దారా మాల్యాద్రి (45) పోకూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కందుకూరు నుంచి వలేటివారిపాలెంకు వెళ్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టడంతో మాల్యాద్రి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని కందుకూరు పట్టణ ఎస్‌ఐ సిహెచ్ హజరత్తయ్య పరిశీలించారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కందుకూరు, ఆగస్టు 17: మండల పరిధిలోని విక్కిరాలపేట గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కె సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం పాత సింగరాయకొండకు చెందిన సులోచనకు విక్కిరాలపేటకు చెందిన జి సుబ్బారావుతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈనేపథ్యంలో బుధవారం సులోచన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సులోచన తల్లిదండ్రులు మాత్రం భర్త, అత్తమామలు చంపి ఉరివేశారని ఆరోపిస్తున్నారు. కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తాపడి ముగ్గురికి గాయాలు
సింగరాయకొండ, ఆగస్టు 17: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడి ముగ్గురు గాయపడిన సంఘటన బుధవారం ఉదయం కలికవాయి రోడ్డు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సింగరాయకొండ జాతీయ రహదారిపై కలికవాయి రోడ్డు సమీపంలో డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 48మంది ప్రయాణికులు ఉండగా వారిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సింగరాయకొండ ఎస్‌ఐ వైవి రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును పైకిలేపారు.