ప్రకాశం

భావిభారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, ఆగస్టు 17: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గం శాసనమండలి సభ్యులు యండపల్లి శ్రీనివాసరెడ్డి బుధవారం రాచర్ల మండలంలోని ఆకవీడు, అనుమలవీడు, పుల్లలచెరువు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈపర్యటనలో భాగంగా పిహెచ్‌సిలు, వైద్యశాలు, మండలంలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిర్వహించాలని, విద్యార్థులకు మంచి విద్యను అందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందేలా చూడాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ రద్దుచేసేందుకు పోరాడుతున్నామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేశారో అర్థంకావడం లేదని, దాదాపు లక్షా 42వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదేళ్ళ నుంచి ఉన్న ఖాళీల్లో ప్రస్తుతం 20వేల పోస్టుల భర్తీకి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బడ్జెట్ ప్రస్తావనలో తేలింది కానీ, ఇప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదన్నారు. ఇంటికో ఉద్యోగం అనే మాటతో యువత ఆకర్షితులయ్యారని, వారి ఆశయాలు అడియాశలయ్యాయని అన్నారు. ఈసందర్భంగా ఆయన పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్లు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రమణారెడ్డి, శ్రీనునాయక్, రంగారెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి రవీంద్రనాథరెడ్డి, జెవివి జిల్లా నాయకులు స్వరూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి ఘన సన్మానం
రాచర్ల మండల పర్యటనలో భాగంగా ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసరెడ్డిని అనుమలవీడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం సమస్యలను విన్నవించారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎం కాశిరంగారెడ్డి, జి రవీంద్రనాథరెడ్డి, ఎంఇఓ మాధవకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.