ప్రకాశం

నాడు మావోయిస్టు ఉద్యమంలో కీలకనేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఆగస్టు 18: నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న సమయంలో కీలకనేతగా ఉండి ఆయుధాలు సమకూర్చిన టెక్ మధు నేడు నరుూం ముఠాలో సూత్రధారిగా మారడం విశేషం. మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న సమయంలో ఆయుధాలను మావోయిస్టులకు సమకూరుస్తూ 2005లో క్రాంతి ట్రాన్స్‌ఫోర్టు ద్వారా రాకెట్ లాంచర్ల విడిభాగాలను సరఫరా చేస్తూ పట్టుబడిన టెక్ మధు మార్కాపురం ప్రాంతంలో కొంతకాలం సామాన్య జీవితాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో పలువురు ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని తన అంతరంగ విషయాలను రహస్యంగా ఉంచి మావోయిస్టు ఉద్యమానికి సహాయ సహకారాలు అందించారు. గిద్దలూరులో క్రాంతి ట్రాన్స్‌ఫోర్టు కార్యాలయంలో రాకెట్ లాంచర్ల విడిభాగాలు దొరకడం అప్పుడు జిల్లాఎస్పీగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం, మార్కాపురం ఓఎస్‌డిగా పని చేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎస్పీగా ఉన్న రంగనాథ్ ఆధ్వర్యంలో టెక్ మధును అదుపులోనికి తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువగా మార్కాపురంలో సంచరించేవాడు. కాగా కొంతకాలం కిందట మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుకట్టిన అండర్‌వరల్డ్ డాన్ నరుూం మృతి చెందాడు. ఈ నేపధ్యంలో టెక్ మధు పేరు మరోసారి తెరపైకి రావడంతో ఈ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో నరుూంకు కోట్ల రూపాయల విలువగల ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరగడంతో టెక్ మధు, నరుూం అనుచరుల పాత్ర ఉండవచ్చునని ఈప్రాంతప్రజలు భావిస్తున్నారు. ఇందుకుతోడు నరుూం సోదరుడు సలీం ఒంగోలులో రహస్యంగా నివాసం ఉంటూ అప్పుడప్పుడు నరుూం అక్కడికి వచ్చిపోతున్నట్లు సమాచారం ఉండటంతో మార్కాపురం ప్రాంతంలో కూడా అతని ఆగడాలు సాగిఉంటాయని, తీగలాగితే కాని డొంక కదిలి అసలు విషయం బహిర్గతం కాదని పలువురు భావిస్తున్నారు. కాగా నరుూం మరణం అనంతరం సిట్ బృందం పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతుండటంతో టెక్ మధుతో సంబంధాలు ఉన్నవారు వారి విషయాలు ఎక్కడ బహిర్గతం అవుతాయోనని భయపడుతున్నారు. ఏదిఏమైనా ఇప్పటికే సంబంధిత శాఖ నిఘా పెంచడం ఈప్రాంతంలో సంచలనంగా మారింది.
* మార్కాపురం డివైఎస్పీ వివరణ
ఇప్పటివరకు నరుూం కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, సిట్ సంస్థ విచారణ జరుపుతున్నందున పోలీసుశాఖకు ఎలాంటి సమాచారం ఉండదని, స్థానికంగా ఏదైనా సమాచారం అవసరమైతే రాష్టస్థ్రాయి అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటారని మార్కాపురం డివైఎస్పీ ఆర్ శ్రీహరిబాబు తెలిపారు.