ప్రకాశం

చెరువులో పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, అక్టోబర్ 4: మార్టూరు - గన్నవరం రోడ్డులో కుప్పాయకుంటే చెరువులో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మార్టూరులో గొట్టిపాటి నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బతుకుతెరువు కోసం సోమవారం కొంగలు కొట్టుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్లారు. ప్రభుదాస్ (12) చెరువులో కొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ నీటిలో మునిగిపోయాడు. అతన్ని రక్షించడానికి సూరయ్య (28) చెరువులో దూకాడు. ఇద్దరు ఊబిలో కూరుకుపోయారు. వారు ఇంకా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతుకుతుండగా కుంట దగ్గర రిక్షా, చెప్పులు గుర్తుపట్టి చెరువు దగ్గరకు వెళ్లి చూశారు. నీటిలో మృతదేహాలు కనిపించడంతో వెంటనే చెరువులోకి దిగి మృతదేహాలను బయటికి తీశారు. దీంతో గొట్టిపాటినగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెరువు దగ్గరకు తండోపతండాలుగా వచ్చి జనం చూసి వెళ్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.